English   

అల్లు అర్జున్  సుకుమార్ మూవీకి  కరోనా ఎఫెక్ట్ 

Allu Arjun Sukumar
2020-03-14 11:26:01

చైనాలో పుట్టిన కరోన వైరస్ అక్కడ తగ్గుముఖంగా పట్టినా ఇటలీ వంటి దేశాలలో ఈ వైరస్ పెరిగిపోయింది. ఇండియాకి రాదులే అనుకుంటే ఆ వైరస్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎంటర్ అయ్యింది. ఇప్పటికే ఎనభైకి పైగా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా వైరస్ వలన మరణించారు కూడా. ఇప్పుడు ఈ వైరస్ సినిమా రంగాన్ని కూడా పట్టి కుదిపేస్తోంది. ఈ దెబ్బకి ఇప్పటికే కేరళ, బెంగళూరు వంటి చోట్ల ఇప్పటికే సినిమా థియేటర్స్ మూసేశారు. 

ఇప్పుడు ఈ దెబ్బ సినిమా షూటింగ్స్ మీద కూడా పడుతోంది. ఇప్పటికే ఇటలీ వెళ్ళిన ప్రభాస్ జాన్ సినిమా యూనిట్ అంతా కరోనా దెబ్బకు వెనక్కు వచ్చేస్తోంది. మరో పక్క చాలా చోట్ల షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది బన్నీ సుకుమార్ సినిమా మీద కూడా పడింది. ఎందుకంటే బన్నీ సుకుమార్ సినిమా షూటింగ్ ముందుగా బ్యాంకాక్ లో షూట్ చేయాలని అనుకున్నారు. అప్పటికే కరోనా ప్రబలుతుండడంతో అక్కడ షూట్ క్యాన్సిల్ చేసుకున్నాడు సుకుమార్. ఇప్పుడు ఆ షూట్ అంతా కేరళ అడవుల్లో ప్లాన్ చేశారు. అయితే అంతా రెడీ అయ్యి అక్కడికి షూట్ కి వెళ్ళే సమయానికి అక్కడ కూడా కరోనా ప్రబలుతుండడంతో అక్కడి ప్రభుత్వం సినిమాలకి ఇచ్చిన షూటింగ్ పర్మిషన్స్  అన్నీ క్యాన్సిల్ చేసినట్టుగా చెబుతున్నారు. 

దీని మీద ఇంకా సినిమా యూనిట్ అయితే ఇంకా ఏమీ ప్రకటించలేదు కానీ సినిమా లేట్ అవుతుందని మాత్రం అందరూ టెన్షన్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు. బన్నీ ఈ సినిమాలో మాస్ లుక్ లో లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి శేషాచలం అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ దెబ్బకు ఈ సినిమా కోసం ఏడాది పైగా టైం వెస్ట్ చేశాడు సుకుమార్. కధ అంతా రెడీ చేసుకుని కూడా ఆయన ఇంత సమయం ఎదురు చూసినా ఇప్పుడు కరోనా సుకుమార్ ని దెబ్బ వేసిందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

More Related Stories