బాలయ్యని డైరెక్ట్ చేయనున్న బుర్రా సాయి మాధవ్

టాలీవుడ్లో ప్రస్తుతం కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ అందరూ గతంలో రచనా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వారే. త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి లాంటి వారంతా రైటర్లుగా తమ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లే. వీళ్లలో త్రివిక్రమ్, కొరటాల, అనిల్ రావిపూడి స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల లిస్ట్‌లోకి ఇప్పుడు కొత్తగా బుర్రా సాయిమాధవ్ కూడా చేరనున్నాడని నటున్నారు.
టాలీవుడ్లో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న సాయిమాధవ్ ను ఓ బడా నిర్మాత ఏకంగా బాలయ్యనే డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. ఓ స్టార్ హీరో సినిమాతో దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడట. నిజానికి బాలకృష్ఱకు అసలు గతేడాది ఏమీ కలిసి రాలేదు.క్రిష్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ వద్ద పూర్తిగా విఫలం అయ్యాయి. ఆ తర్వాత ఏడాది చివర్లో కెఎస్ రవికుమార్‌తో రూలర్ చేసినా ఆ సినిమా మరింత డిజాస్టర్ గా నిలిచిందో చెప్పక్కర్లేదు.
అందుకే ఇప్పుడు ఆయన తనకి కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఈ సినిమా తర్వాత బీ గోపాల్ దర్శకత్బంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక బుర్రా సాయిమాధవ్ దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. చూద్దాం ఈ సినిమాలు అయినా బాలయ్యకి హిట్స్ ఇస్తాయేమో ?