English   

పలాస దర్శకుడు అడ్వాన్స్ తీసుకున్నది దేవరకొండ కోసమా 

Vijay Deverakonda
2020-03-14 22:22:59

చిన్న సినిమాగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్న సినిమా ప‌లాస‌ 1978. ఈ సినిమా ప్రమోసన్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ వలన నష్టపోయింది కానీ మంచి కలెక్షన్స్ తెచ్చుకోవాల్సిన సినిమా. దళితుల సినిమా దళితులే చూడకుంటే ఎలా అని ఆయన కామెంట్ చేయడంతో చాలా మంచి ఈ సినిమా చాలా మందిని చూడకుండా చేసింది. అయితే ఈ సినిమా మీద నెగటివ్ ప్రమోషన్ తో ఇబ్బందులు తెచ్చుకున్నా దర్శకుడికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టంది. 

అందుకే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందే ఆ కరుణ కుమార్ కి గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు కూడా. ఈ సినిమా రిలీజ్ కాకముందే సినిమా చూసిన అల్లు అరవింద్ అడ్వాన్స్‌గా చెక్ ఆరోజునే ఇచ్చేయడం అప్పట్లోనే సంచలనంగా మారింది. అయితే తాజాగా అందుతున్న సమాకాహరం ప్రకారం క‌రుణ కుమార్‌ కి ల్లు అర‌వింద్ అడ్వాన్స్ ఇచ్చింది విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా కోస‌మ‌ని అంటున్నారు. ఆ దర్శకుడు తన దగ్గర ఉన్న రెండు మూడు లైన్స్ అల్లు అరవింద్ కి వినిపించాడట. 

ఎగ్జయిట్ అయిన అరవింద్ వెంటనే అడ్వాన్స్ ఇచ్చి, విజ‌య్‌ కి అందులో ఒక క‌థ వినిపించ‌మ‌ని అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు. ప్రస్తుతం అరవింద్ కీ విజ‌య్ దేవ‌ర‌కొండకీ మంచి ర్యాపో ఉంది. గీతా గోవిందం, ట్యాక్సీవాలా దగ్గర నుండి మొన్న ఆహా బ్రాండ్ అంబాసిడర్ దాకా వారి బంధం సాగుతోంది. దేవ‌ర‌కొండ ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లైనప్ లో ఒకటి రెండు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమా తర్వాత కరుణ కుమార్ తో సినిమా మొదలవచ్చని అంటున్నారు.

More Related Stories