English   

అల్లు అర్జున్ హీరోయిన్ సైలెంట్ పెళ్లి..

sheela
2020-03-15 07:32:28

కొందరు హీరోయిన్లు సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోయిన్ కూడా ఇదే చేసింది. బన్నీ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు కదా అందులో ఎవరు అనే అనుమానం రావచ్చు. పరుగు సినిమాలో నటించిన షీలా గుర్తుండే ఉంటుంది కదా. ఆ సినిమాలో తన అమాయకమైన నటనతో అందర్నీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈమె. ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నట్లుండి పెళ్లి పీటలపై కనిపించింది. ఒక్క మాటైనా చెప్పకుండా.. ఇండస్ట్రీలో ఎవర్నీ పిలవకుండా పెళ్లి చేసుకుంది షీలా. పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది కానీ ఇండస్ట్రీనే వదిలేసిందని అర్థం చేసుకోలేదెవ్వరూ. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా కూడా కనీసం ఇండస్ట్రీ నుంచి ఒక్కరికి కూడా ఈమె నుంచి ఆహ్వానం అందలేదు. అందుకే సైలెంట్ గా పెళ్లి అయిపోయింది. పరుగు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్..

రామ్ మస్కా సినిమాల్లో సెకండ్ లీడ్ చేసింది షీలా, బాలయ్యతో పరమవీరచక్రలో నటించింది.  ఆ తర్వాత ఓ టాప్ టాలీవుడ్ నిర్మాతతో ఎఫైర్ కూడా నడిపిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి దూరమైపోయింది షీలా. సినిమాలు పూర్తిగా తగ్గిపోవడంతో పెళ్లి చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఈ భామకు. అందుకే ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకుంది షీలా. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మొత్తం 24 సినిమాలు చేసింది షీలా. ఇప్పుడు ఈమె సంతోష్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి చెన్నైలో వైభవంగా జరిగింది. అయితే ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఈ పెళ్లి వేడుకలో కనిపించకపోవడం విడ్డూరంగా అనిపించింది. కేవలం బంధువులు, మిత్రులు, కొంతమంది ఆప్తులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరైనట్లు తెలుస్తుంది. కావాలనే పిలవలేదా లేదంటే ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండాలనే ఇలా చేసిందా అనేది ఆసక్తికరంగా మారింది.

 

More Related Stories