English   

కరోనా వైరస్ అరికట్టడానికి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు: మెగాస్టార్ చిరంజీవి

chiru
2020-03-15 07:45:15

కరోనా వైరస్ దాడి నుంచి తట్టుకోవడానికి  అన్ని ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా మార్చి 31 వరకు విద్యాసంస్థలకు, సినిమా థియేటర్లకు  అన్నింటికీ  బంద్ ప్రకటించింది. ఈ సందర్భంగానే చిరంజీవి కరోనా వైరస్  తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా ఒక లేఖను విడుదల చేశారు. తక్షణమే తన సినిమా షూటింగ్ లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మెగాస్టార్. ఈ వైరస్ ను అరికట్టడానికి ప్రజల నుంచి సహకారం కావాలని ఆయన తెలిపాడు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని.. మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు చిరంజీవి. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా జనాలు గుమికూడకుండా క్రీడల్ని వాయిదా వేయడం, మాల్స్, సినిమా హాల్స్ ని మూసివేయడం, స్కూల్స్, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తదితర చర్యలు తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు చిరంజీవి. కరోనా నియంత్రణ బాధ్యత ప్రభుత్వాలకే వదిలివేయకుండా అందరూ భాగస్వామ్యులు కావాలని కోరాడు మెగాస్టార్.

అందరిలో చైతన్యం కలిగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానని ఆయన తెలిపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరిలో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీస్కుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ముందస్తు నివారన చర్యలు ప్రారంభించినట్టు తెలుసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు మెగాస్టార్. పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపాడు. కాగా సినిమా షూటింగ్స్ లో కూడా పెద్ద సంఖ్యలో సాంకేతిక నిపుణులు పనిచేయాల్సి ఉంది.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుంచి 15 రోజుల పాటు షూటింగ్స్ వాయిదావేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నానని కన్ఫర్మ్ చేశాడు చిరంజీవి. ప్రస్తుతం చిత్రీకరణ కొనసాగుతోన్న తన సినిమా షూటింగ్ ని వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే అంగీకరించారని తెలిపాడు అన్నయ్య. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు.. కనుక ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్ ని నియంత్రణ చేసే ఉద్యమంలో సినీరంగం కూడా పాలు పంచుకోవాలని ఆయన కోరాడు. అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

 

More Related Stories