English   

సాయి పల్లవిని ఫాలో అవుతున్న తమన్నా..

sai
2020-03-15 08:02:22

నమ్మడానికి కాస్త కొత్తగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది. నిజంగానే తమన్నా ఇప్పుడు సాయి పల్లవిని ఫాలో అవుతుంది. ఒక విషయంలో మాత్రం ఫిదా బ్యూటీని తూచా తప్పకుండా ఫాలో అయిపోతుంది మిల్కీబ్యూటీ. స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కొన్ని డిమాండ్లు ఉంటాయి. నేను వీళ్ళతోనే నటిస్తాను.. వీళ్లతో నటించను అని చెప్పే స్వేచ్ఛ కూడా వాళ్లకు ఉంటుంది. చిన్న హీరోలతో నటించడానికి స్టార్ హీరోయిన్లు అస్సలు ఒప్పుకోరు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా అందరు హీరోలతో నటిస్తారు. చిన్న పెద్ద తేడా వాళ్లకు తెలియదు. కథ నచ్చితే అందులో వాళ్లు కూడా భాగం అయిపోతారు. ఇందులో తమన్నా భాటియా గురించి ముందుగా చెప్పుకోవాలి. చిన్న హీరోలు పెద్ద హీరో అనే తేడా లేకుండా అందరితో సామాజిక న్యాయం పాటించే హీరోయిన్ ఈమె. చిరంజీవితో నటిస్తోంది.. అలాగే మళ్లీ ఎలాంటి భేషజాలు లేకుండా సందీప్ కిషన్ లాంటి హీరోతో కూడా రొమాన్స్ చేస్తోంది.

ఇప్పుడు మరోసారి ఇలాంటి పని చేస్తోంది తమన్నా. గతేడాది వరుసగా స్టార్ హీరోలతో నటించిన ఈమె ఈ ఏడాది మాత్రం గోపీచంద్ లాంటి చిన్న హీరోతో మొదలు పెడుతుంది. ఇదివరకే ఈయన హీరోగా వచ్చిన గౌతమ్ నంద సినిమా లో నటించింది తమన్నా. సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సిటీమార్ సినిమాలో నటిస్తోంది. ఇందులో కబడ్డీ కోచ్ గా నటిస్తోంది తమన్నా భాటియా. ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ తో నటించడానికి స్టార్ హీరోయిన్ ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ తమన్నా మాత్రం తనకు అలాంటి అభ్యంతరాలు లేవు.. తేడాలు అసలే లేవు అంటుంది. ఈ సినిమాలో తెలంగాణ కోచ్ గా నటిస్తోంది తమన్నా. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా తెలంగాణ యాస నేర్చుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే కొన్ని సినిమాలలో డబ్బింగ్ చెప్పుకున్న తమన్నా సీటీ మార్ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతుంది. ఏదేమైనా కూడా తమన్నా సామాజిక న్యాయం చూసి నిర్మాతలు కూడా సంతోషిస్తున్నారు. గోపీచంద్ సినిమా కోసం దాదాపు 80 లక్షల వరకు పారితోషికం అందుకుంది తమన్నా.

 

More Related Stories