English   

సినిమా ఆఫర్ అడిగితే బెడ్రూమ్ కి పిలిచాడంటున్న హీరోయిన్..

vani
2020-03-15 08:20:02

సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది వేర్లతో సహా పాకిపోయింది. అంత త్వరగా దీన్ని తీసేయడం కుదరని పని. అవకాశం రావాలంటే కచ్చితంగా అమ్మాయి పడుకోవాల్సిందే అంటూ ఇక్కడ ఒక నీచమైన రూల్ ఉందని.. చాలా రోజులుగా ఎంతో మంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది.
షమ్మీర్ సుల్తాన్ దర్శకతంలో తరుణ్ భాస్కర్ హీరోగా గతేడాది  విడుదలైన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో నటించిన వాణి భోజన్ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ విషయాల గురించి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఈమె తమిళనాట టెలివిజన్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది  ఆ తర్వాత హీరోయిన్ గా మారింది.

విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వాణి.ఈ సినిమా కంటే ముందు తనకు ఎదురైన అనుభవాలను బయట పెట్టింది వాణి బోజన్‌. ఇండస్ట్రీలో తాను ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. సినిమా అవకాశం కావాలని అడిగితే ఓ నిర్మాత బెడ్ రూమ్ కి రమ్మన్నాడని సంచలన విషయాలు బయట పెట్టింది. దాంతో తనకు అలాంటి అవకాశం వద్దని చెప్పినట్లు వెల్లడించింది. వాణి బోజన్‌ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి. అయితే తనను పడకగదికి పిలిచిన నిర్మాత పేరు మాత్రం బయటపెట్టలేదు ఈమె. అదేమిటని అడిగితే ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఇలాంటివి కామన్ అని ఆయన చెప్పినట్లు వాణి భోజన్ చెప్పింది. దాంతో ఆ నిర్మాత ఎవరై ఉంటారా అని ఇప్పుడు ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు.

 

More Related Stories