English   

సరికొత్త అమృతంలో అన్నీ ఉన్నాయి.. ఆయన తప్ప..

serial
2020-03-15 08:53:32

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన కామెడీ సీరియల్ అమృతం. గుణ్ణం గంగరాజు తెరకెక్కించిన ఈ సీరియల్ దాదాపు ఐదేళ్ల పాటు నిర్విరామంగా సాగింది. టెలివిజన్ తెరపై సంచలన రేటింగ్స్ సాధించి ఎన్నో రికార్డులు సృష్టించింది అమృతం. చాలా టీవీ ఛానళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దీన్ని రిపీట్ షోలు వేసుకున్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అమృతం సీరియల్ కు ఉన్న క్రేజ్ ఏంటో. ఇక ఇప్పుడు అమృతం కొత్త సీజన్ మళ్లీ మొదలైపోయింది. దర్శకుడు నిర్మాతలు మారిపోయినా కూడా అదే పాత వాసన వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు ఇప్పటి నిర్మాతలు. అప్పుడు అమృతం పాత్రలో నటించిన హర్షవర్ధన్ మరోసారి అమృతరావు పాత్రలో ఒదిగి పోతున్నాడు.

వాళ్ళతో పాటే అప్పుడు నటించిన సత్యా కృష్ణన్, రాగిణి లాంటి వాళ్లు ఇప్పుడు కూడా నటిస్తున్నారు. సర్వం పాత్రలో మళ్లీ పాత నటుడు కనిపిస్తున్నాడు. ఇక అమృతం సీరియల్లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన అప్పాజీ పాత్రలో శివన్నారాయణ కనిపిస్తున్నాడు. సరికొత్త అమృతం ట్రైలర్ కూడా బాగుంది. అయితే అంతా బాగుంది కానీ ఒకరి విషయంలో మాత్రం అభిమానులు బాధ పడుతున్నారు. అదే గుండు హనుమంతరావు ఆంజనేయులు పాత్రలో ఎంతగానో నవ్వించాడు ఈయన. ఆ సీరియల్ కు అందాన్ని తీసుకొచ్చాడు. ఏడాది కిందట ఆయన చనిపోవడంతో ఇప్పుడు అమృతంలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంజనేయులు పాత్ర కోసం ఎల్బీ శ్రీరామ్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఆయన గుండు హనుమంతరావును ఎంతవరకు మరిపిస్తారనేది చూడాలి. మార్చ్ 25 నుంచి డిజిటల్ ప్లాట్ ఫాంపై అమృతం సరికొత్త వర్షన్ విడుదలవుతుంది.

More Related Stories