English   

అలా చూపిస్తూ కాలక్షేపం చేస్తున్న వాణీ కపూర్..

vani
2020-03-15 09:53:16

వాణి క‌పూర్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌చ్చు. కానీ ఒక్క‌సారి నాని న‌టించిన ఆహాక‌ళ్యాణం గుర్తు చేసుకుంటే వాణి క‌పూర్ ఎవ‌రో తెలిసిపోతుంది. అంతెందుకు 2016లో విడుద‌లైన బేఫికరే గుర్తు చేసుకోండి.. అందులో ముద్దుల‌తో ముంచెత్తిన ముద్దుగుమ్మే ఈ భామ‌. ఇక్క‌డ‌.. హిందీ ఎక్క‌డా కూడా ఈ భామ‌కు గుర్తింపు రాలేదు. పెద్ద సినిమాలు చేసినా ప‌ట్టించుకోలేదు. బాలీవుడ్ లో కూడా వాణికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌ట్లేదు. అక్క‌డ న‌టించిన ప్ర‌తీ సినిమాలోనూ అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు అందాల ఆర‌బోత‌ పీక్స్ కు చేరింది. ప్ర‌తీ ఫోటోషూట్ లోనూ స్క్రీన్ షేక్ చేస్తుంది వాణిక‌పూర్. ఆఫ‌ర్లు లేక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై అదిరిపోయే అందాల షో చేస్తుంది వాణిక‌పూర్.

ఇక ఆ మధ్య ఏకంగా మ్యాగ్జిమ్ ఫోటోషూట్ పై పిచ్చెక్కించే రేంజ్ లో అందాలు ఆర‌బోసింది వాణిక‌పూర్. మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ అంటేనే అందాల ఆర‌బోత పీక్స్ అని అర్థం. ఇప్పుడు వాణి కూడా ఇదే చేసింది. తెలుగులో ఆహాక‌ళ్యాణం త‌ర్వాత ఈమెకు అవ‌కాశాలే రాలేదు. బాలీవుడ్ లో కూడా య‌శ్ రాజ్ లాంటి సంస్థ నుంచి వ‌ర‌స‌గా సినిమాలు వ‌చ్చినా కూడా ఈ భామ స్టార్ కాలేక‌పోయింది. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫ‌లితం మాత్రం శూన్య‌మే. గతేడాది హృతిక్ రోషన్ సరసన వార్ సినిమాలో నటించింది వాణి. సినిమా సూపర్ హిట్ అయినా ఈమెకు మాత్రం కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు రిక్త హ‌స్తాల‌తో ఖాళీగా ఉంది. ఇప్పుడు కూడా అవ‌కాశాలు లేక అందాల‌నే ఆర‌బోస్తూ కాలం గ‌డిపేస్తుంది వాణిక‌పూర్. మ‌రి ఈ అందాల వీణ‌ను ఎవ‌రు శృతి చేస్తారో..? 

More Related Stories