English   

ఉగాదిని క్లీన్ స్వీప్ చేసిన కరోనా వైరస్..

virus
2020-03-15 10:52:13

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇదే జరుగుతుంది. కరోనా వైరస్ దెబ్బకు సినిమా థియేటర్లు మూత పడ్డాయి. చాలా సంవత్సరాల తర్వాత జనాలు థియేటర్లకు రావడం మానేశారు. ఎంత పెద్ద విపత్తు వచ్చినా కూడా కచ్చితంగా శుక్రవారం కొత్త సినిమాలు విడుదలయ్యేవి. ఆడియన్స్ కూడా తమ బాధను మరిచిపోవడానికి సినిమాలకు వచ్చేవాళ్ళు. కానీ కరోనా వైరస్ దెబ్బకు కొన్ని వారాలుగా థియేటర్ల మొహం చూడటం లేదు జనాలు. దాంతో టికెట్ కౌంటర్స్ దగ్గర ఈగలు తోలుకుంటూ అలా కాలం గడిపేశారు థియేటర్ల యాజమాన్యం. ఈ కరోనా వైరస్ దెబ్బకు భీష్మ, హిట్ లాంటి సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కోట్ల రూపాయల నష్టపోయాయి. ఇప్పుడు రోజురోజుకు కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుండటంతో మార్చి 31 వరకు సినిమా థియేటర్లు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. దానికంటే ముందే తెలుగు సినిమా నిర్మాతల మండలి కూర్చొని మాట్లాడుకొని తమ సినిమాలు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఉగాది సీజన్ క్యాష్ చేసుకోవాలని కలలు కన్న నాచురల్ స్టార్ నాని ఆశలకు కరోనా వైరస్ గండి కొట్టింది. ఈయన నటించిన వి సినిమా ఉగాది నుంచి వాయిదా పడింది. ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దాంతోపాటే మరికొన్ని సినిమాలు కూడా ఉగాది నుంచి వాయిదా పడ్డాయి. అందులో యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? సినిమా కూడా ఉంది. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మొత్తానికి చూసుకుంటే ఈసారి ఉగాది సీజన్ మొత్తం కరోనా వైరస్ ఖాతాలో పడిపో

More Related Stories