English   

విశ్వక్ ని ఆ సినిమా నుండి తీసేశారట !

hero
2020-03-15 15:30:48

ఒక కప్పల జాడీల కధ మనం వినే ఉంటాం.. అది వచ్చేసి అన్ని దేశాల నుండి రకరకాల కప్పలను తెచ్చి ప్రయోగాల కోసం ఉంచారట. అన్ని దేశాల కప్పల జాడీలకి మూతలు ఉంటే మన దేశానికి చెందిన కప్ప్లున్న జాడీకి మూత పెట్టలేదంట. ఎందుకని అడిగితే మిగతా దేశాల కప్పలు ఒకదానికి ఒకటి సహాయం చేసుకుని బయట పడతాయని, కానీ ఇండియా కప్పలు మాత్రం అలా కాదని అన్నారట. అదేంటంటే ఒక కప్పు పైకి లాగుతుంటే దానిని మిగతా కప్పలు లగేస్తాయని చెప్పుకొచ్చారు. ఇలాంటిదే హీరో విశ్వక్ సేన్ కి కూడా ఒక సంఘటన ఎదురయిందట. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా వేల్లిపోమాకే. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'ఈ నగరానికి ఏమైంది' విశ్వక్ సేన్ కు కొంచెం పేరు తెచ్చుకుంది. ఈ సినిమా షూటింగ్‌ మొదలైన వారం తర్వాత ఏమైందో ఏమో కానీ ఆయన్ను సినిమా నుండి తప్పించారట.ఆయన ప్లేస్ లో ఇంకెవర్నో తీసుకుని, ఎందుకలా జరిగిందని తరుణ్‌కి ఫోన్‌ చేస్తే 'ఎవరో అమ్మాయి మెయిల్‌ పంపింది విష్వక్‌...

నువ్వు ఆమెకి అవకాశం ఇప్పిస్తానని మిస్‌బిహేవ్‌ చేశావని. అందుకే తీసేశామని చెప్పాడట. విశ్వక్ ఊరుకోకుండా తనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని తరుణ్ ను విసిగించడంతో సదరు ఆకాశరామన్న మెయిల్ ను విశ్వక్ కు ఫార్వర్డ్ చేశాడట.  ఆ మెయిల్ చూడగానే అదెవరి పనో విశ్వక్ అర్థం చేసుకుని తరుణ్ కు చెప్పాడట. అంతే కాక పెటిన అతని దగ్గరకెళ్లి 'ఇది ఈ ఒక్క సినిమాతో ఆగిపోదు. పరిశ్రమలో ఇంకెవరూ నాకు అవకాశం ఇవ్వకపోవచ్చు. దయచేసి ఆ మెయిల్‌ పంపింది నువ్వేనని ఒప్పుకో!' అని అడిగితే అతను వినలేదట. అప్పుడే అతను ఎవరి పేరుమీద మెయిల్‌ పెట్టాడో ఆ అమ్మాయి తన పేరుని ఇలా వాడుకున్నందుకు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనికి దెయ్యం వదిలి కాళ్ళ బేరానికి వచ్చాడట.  అలా తాను మళ్ళీ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

More Related Stories