English   

సీనియర్ హీరోకి అనారోగ్యం...అంత సీక్రెట్ గా ఎందుకు

senior
2020-03-15 15:58:43

ఆయన ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలిన టాప్ హీరోలలో ఒక్కడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముగ్గురు ఇండస్ట్రీకి చెందిన వారసులు అయిన హీరోలతో సమానమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన ఒకప్పుడు ఎంత పేరు సంపాదించాడో ఈ మధ్య అంత వివాదాస్పదంగా మారాడు సదరు హీరో. ఎప్పుడో సినిమాలు చేసి హిట్స్ కొట్టిన్ ఆయన రెండు మూడేళ్ళ క్రితమే ఒక హిట్ తో మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా ఎక్కడా కనపడటం లేదు. ఆయన రెండు మూడేళ్ళ క్రితం చేసిన ఒక సినిమా ఈ మధ్య రిలీజయింది. కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. అయితే ఆయన ఒక సినిమా ఒప్పుకుని ఉండడంతో ఆ సినిమా షూటింగ్ లో బిజీ అనుకున్నారు. కానీ ఆయనకు తీవ్రమైన అనారోగ్యం ఏదో వచ్చిందని ఇప్పుడు టాలీవుడ్ లో ఒక ప్రచారం మొదలయింది. అందుకే ఆయన ఎవరికీ కనిపించకుండా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఆ ట్రీట్మెంట్ దెబ్బకి ఆయన పూర్తిగా కోలుకున్నాడట. దాదాపు చావు అంచుల దాకా వెళ్ళి వచ్చిన ఆయనను ఇప్పుడు విషయం తెలిసిన ఇండస్ట్రీ పెద్దలు, సన్నిహితులు వెళ్లి పరామర్శించి వస్తున్నారట. అయితే ఇప్పుడు తెలిసిన మరో విషయం ఏమిటంటే ఆమధ్య ఓ సినిమాను అధికారికంగా ప్రకటించినా దానిని ఆపేశారట. అప్పట్లోనే దాని గురించి మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అది నిజమేనని ఇప్పుడు నమ్ముతున్నారు జనాలు. ఆయిత ఆయనకు జబ్బు వచ్చి తగ్గిపోయినా అదేమిటి అనే విషయాన్ని మాత్రం బయటకు రానీయలేదు కుటుంబం. 

More Related Stories