English   

కరోనా ఎఫెక్ట్ : రేపటి నుండి టాలీవుడ్ షూటింగ్స్ కూడా బంద్

tollywood
2020-03-15 19:51:47

కరోనా ఎఫెక్ట్ ఇప్పటికే తెలంగాణాలోని అన్ని మాల్స్, థియేటర్స్ మీద పడగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ సినిమా షూటింగ్ ల మీద కూడా పడింది. ఈరోజు ఆ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్,మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయాన్ని ప్రకటించారు. తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో రేపటి నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ ప్రకటించారు. సినిమా లో భాగమైన 24 విభాగాలతో సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. షూటింగ్స్ లో చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ల ఆరోగ్యం దృష్ట్యా రేపటి నుంచి 21 వరకు షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్చించి ఏకగ్రీవంగా ఈ ప్రకటన చేస్తున్నామని అయన పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణా గవర్నమెంట్ ఆదేశాల మేరకు రేపటి నుంచి షూటింగ్స్ అపివేస్తున్నామని ఈనెల 21 వరకు బంద్ ఉంటాయని అన్నారని అయితే ఆ తరువాత 31వరకు ఆ బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కరోనా పై మా వంతు ప్రయత్నంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు నడచుకుంటూన్నామని మా యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ పేర్కొన్నారు. కొందరు నిర్మాతలకు ఇబ్బంది వున్నా కొంత అడ్జస్ట్ చేసుకుని సహరించాలని సి కళ్యాణ్ పేర్కొన్నారు.  

 

More Related Stories