English   

శ్రీ రెడ్డి మీద పవన్ ఫైర్...ఒకప్పటి పవన్ అయ్యింటేనా

Pawan Kalyan.jpg
2020-03-15 22:24:48

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి ఒకప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఆడుకుంది. పవన్ కళ్యాణ్ మొదలు అల్లు శిరీష్ లాంటి హీరో దాకా అందరినీ భయపెట్టింది. ఏకంగా పవన్ ని తిట్టకూడని తిట్టు తిట్టేసి పవన్ అభిమానులకు, నాగబాబు మొదలగు వారిని తిట్టి పోసి మెగా అభిమానులకి శ్రీరెడ్డి బద్ధ శత్రువుగా మారిపోయింది. అయినా అప్పట్లో నాగబాబు ఎదురు తిరిగి మాట్లాడాడు కానీ శ్రీ రెడ్డిని పవన్ మాత్రం తిరిగి తిట్టలేదు. దానిని అలుసుగా తీసుకుందో ఏమో కానీ అప్పటి నుంచి శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ప్రతి విషయంలోనూ టార్గెట్ చేస్తూనే ఉంది. ఏకంగా అరేయ్ పీకే, ఒరేయ్ పీకే అంటూ ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడేది. ఇన్ని మాట్లాడుతున్నా పవర్ స్టార్ మాత్రం వీటన్నింటిపై ఎన్నడూ పెదవి విప్పలేదు.

కానీ మొన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... కొందరు తన తల్లిపై చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడారని అలా మాట్లాడితే తన కడుపు మండకుండా ఉంటుందా? అని కొంచెం సీరియస్ గానే ప్రశ్నించారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోగల శక్తి వచ్చింది కాబట్టే పొలిటికల్ పార్టీ ని పెట్టగలిగానన్న పవన్ అందుకే అప్పుడు కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నానని అన్నారు. ఈ సమాజం మొత్తం నా కుటుంబం లాగానే భావించాను కాబట్టే ఒకరు తిట్టినా, మరొకరు తిట్టించినా భరించానని ఆయన పేర్కొన్నారు.

అదే సినిమాలు చేసే పాత పవన్ కళ్యాణ్ అయ్యుంటే ఇప్పటికే నన్ను విమర్శించే వాళ్ల(శ్రీ రెడ్డి తాట తీసే వాడినని ఆయన సీరియస్ గా మాట్లాడారు.

More Related Stories