English   

ఆ శాటిలైట్ ఛానల్ ఓనర్ ని చంపేంత కోపం వచ్చిందంటున్న అనిల్ రావిపూడి..

anil
2020-03-16 07:12:18

ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉండే దర్శకుడు అనిల్ రావిపూడి. తన పని తాను చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటున్నాడు ఈయన. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో కమర్షియల్ హిట్ అందుకున్నాడు అనిల్. ఈ సినిమాతో వరుసగా ఐదో విజయాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం అంటూ లేకుండా దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. మాత్రమే ఇలాంటి దర్శకుడికి కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పటాస్ సినిమాకు ముందు ఆయన పడిన కష్టాల గురించి ఈ మధ్య తరుణ్ భాస్కర్ నీకు మాత్రమే చెప్తా షోలో పూస గుచ్చినట్టు చెప్పాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా పటాస్ సినిమా పూర్తయిన తర్వాత దాన్ని విడుదల చేయడానికి చాలా కష్టపడ్డామని ఒకప్పటి గుర్తులు మళ్లీ చెప్పాడు ఈ దర్శకుడు. ఆ సినిమా అంతా పూర్తయిన తర్వాత ఒక శాటిలైట్ ఓనర్ ను పిలిచి స్పెషల్ షో వేశామని.. తీరా సినిమా అయిపోయిన తర్వాత ఇలాంటి చెత్త నా జీవితంలో చూడలేదు..

ఇది ఒక్క రోజు కూడా ఆడదు.. అసలు ఇలాంటి సినిమా ఎలా తీశారు మీరు అంటూ కళ్యాణ్ రామ్ కు వాళ్ళు చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరం నిరాశలో మునిగిపోయాం అని గుర్తు చేసుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే ఆ తర్వాత రోజు దిల్ రాజు, శిరీష్ ఇద్దరు వచ్చి పటాస్ చూసి చాలా బాగుందని చెప్పి వారం రోజుల్లో విడుదల చేశారని.. ఆ తర్వాత అది బ్లాక్ బస్టర్ అయిందని చెప్పాడు అనిల్ రావిపూడి. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా తమ సినిమా చూసి బాలేదు అని చెప్పిన శాటిలైట్ ఓనర్ ను ఆ రోజు చంపేయాలి అన్నంత కోపం వచ్చింది అని చెప్పాడు అనిల్. అయితే ఆ ఛానల్ పేరు మాత్రం బయట పెట్టలేదు. ఒకవేళ వాడు గాని ముందుంటే నువ్వు క్రియేటివ్ హెడ్ అని ఎలా అనుకుంటావురా.. నీకు సినిమా గురించి ఏం తెలుసు అని కడిగి పారేయాలి అంత చిరాకు వచ్చిందని చెప్పాడు అనిల్ రావిపూడి. ఈ షోలో ఇంకా చాలా విషయాలు పంచుకున్నాడు ఈయన.

More Related Stories