English   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట లెక్కచేయని ప్రభాస్..

prabhas
2020-03-16 07:35:24

ప్రభాస్ ఏంటి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట కాదనడం ఏంటి.. విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. దీని దెబ్బకు అందరూ పనులు మానుకొని ఇంటికి పరిమితం అయిపోయారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఎలాంటి షూటింగ్ జరపకుండా కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మార్చి 31 వరకు  సినిమా థియేటర్ లతో పాటు అన్ని మూసి వేయాలని ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పినట్టుగానే సినిమా ఇండస్ట్రీ కూడా తమ సినిమాల షూటింగ్ వాయిదా వేయడమే కాకుండా కొత్త సినిమాల విడుదల తేదీలను కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ కు మాత్రం ఇవేవీ పట్టడం లేదు. ప్రాణాంతక కరోనా ప్రపంచాన్ని కబలిస్తోందని తెలిసినా ఎలాంటి భయం లేకుండా ముక్కుకు మాస్క్ పెట్టుకుని యూరప్ వెళ్లాడు. అక్కడ జార్జియాలో షూటింగ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ అక్కడ నిర్విరామంగా షూటింగ్ జరుగుతుంది. కరోనా వైరస్ రావడానికి అత్యంత అనుకూల వాతావరణం జార్జియాలో ఉంది. కేవలం 10 డిగ్రీల సెంటిగ్రేట్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఆయనతో పాటు కమెడియన్ ప్రియదర్శి.. హీరోయిన్ పూజా హెగ్డే కూడా అక్కడే ఉన్నారు. చల్లగా ఉండే ప్రదేశాల్లో ఈ వైరస్ ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయం తెలిసికూడా ప్రభాస్ సినిమా షూటింగ్ జరపడం ఇప్పుడు కొందరిలో అసహనం రేకెత్తిస్తుంది. ఇన్ని తెలిసిన తర్వాత కూడా అక్కడ ఎందుకు ఉన్నాడని అభిమానులు కూడా ప్రభాస్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని తలనొప్పులు ఎందుకు.. పొరపాటున టీమ్ లో ఎవరికైనా వైరస్ సోకితే పరిస్థితి ఏంటి.. అక్కడ నుంచి ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత ఇక్కడ వాళ్లకు అంటుకుంటే దానికి బాధ్యులు ఎవరు అవుతారు అంటూ సోషల్ మీడియాల్లో ప్రభాస్ సినిమా యూనిట్ పై మండిపడుతున్నారు. అందుకే షూటింగ్ చేసి వెంటనే ఇండియాకు రావాలని వీళ్లను కోరుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి దీనిపై ప్రభాస్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.

 

More Related Stories