English   

పోలీసాఫీసర్ పాత్రలో నాని 

Nani
2020-03-16 11:02:17

నేచురల్ స్టార్ నాని గత ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి మంచి జోష్ మీదున్నాడు. నానికి సినిమా లైఫ్ ఇచ్చిన డైరక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “V”. ఈ సినిమా నిజానికి మార్చి 25వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు అది పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. నేటి నుండి అది కూడా ఆగిపోనుంది అనుకోండి. 

అయితే “టక్ జగదీష్” లో  నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కనిపించబోతున్నారు. హరీష్‌ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. అన్నదమ్ముల అనుబంధాల నేపథ్యంతో శివ ఒక పాత సినిమా కధను నేటి రోజులకి తగ్గట్టుగా మార్చి సినిమా చేస్తున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నాని, ఐశ్వర్యల పాత్రలకు సంబంధించి ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. 

ఇందులో నేచురల్‌స్టార్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా దర్శనమివ్వబోతున్నారని, ఇక ఐశ్వర్య ఆయనకు మరదలు పాత్రలో నటించి అలరించనుందని అంటున్నారు. ఈ సినిమాలో నానికి అన్నగా జగపతిబాబు కనిపించనున్నారని చెబుతున్నారు. ఇక రీతూ పాత్ర ఏమిటన్న దాని మీద అయితే క్లారిటీ లేదు. ముందుగా అయితే ఈ సినిమాని నవంబర్ల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. మరో కరోన ఎఫెక్ట్ ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఎప్పటికి ఫిక్స్ చేసిందో చూడాలి మరి.

More Related Stories