English   

కొడుకును చూస్తే గర్వంగా ఉందంటున్న బన్నీ

Allu Arjun
2020-03-16 11:55:14

దేశానికి రాజయినా తల్లికి కొడుకే, అనే సామెత వినే ఉంటాం. అలానే దేశానికి రాజయినా బిడ్డకి తండ్రే కదా. మన సెలబ్రిటీలు ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అయితే షూటింగులు లేనప్పుడు పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరాదాగా గడుపుతూ వాళ్లు చేసే అల్లరిని తన అభిమానులతో వీడియోల రూపంలో అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఒక పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. 

తాజాగా బన్నీ కొడుకు యాన్ చదువుతున్న బోధి వ్యాలీ స్కూల్ లో ప్రీ గ్రాడ్యుయేషన్ డే జరిగింది. ఈ ఫోటోలు షేర్ చేసిన బన్నీ తన కుమారుడి ఎదుగుదలలో సహకరిస్తున్న టీచర్లకు బన్నీ కృతజ్ఞతలు తెలిపాడు. తన కుమారుడు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నందుకు తాను ఎంతో గర్విస్తున్నానని బన్నీ ట్వీట్ చేశాడు. అయాన్ మంచి విద్యావంతుడు అయ్యేందుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ స్కూల్‌ను ఎంచుకున్నందుకు తల్లిదండ్రులుగా తాము సంతోషిస్తున్నామని, ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అయాన్ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేశాడు బన్నీ.

More Related Stories