English   

బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్స్ మత్తు వదిలించారుగా..

Mathu Vadalara
2020-03-16 12:40:37

కొన్నిసార్లు పెద్ద సినిమాల కంటే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. అలాగే గతేడాది వచ్చిన ఒక చిన్న సినిమా మత్తు వదలరా. రాజమౌళి కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరో సింహ కోడూరి. కొత్త దర్శకుడు రితేష్ రానా ఈ సినిమాను తెరకెక్కించాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది మత్తు వదలరా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అక్కడ కూడా చాలామంది మత్తువదలరా సినిమాను వీక్షించారు.

 తొలి రోజు పాజిటివ్ టాక్ రావడం.. దానికి తోడు బడ్జెట్ కూడా తక్కువ కావడంతో  నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చింది మత్తు వదలరా సినిమా. దీని బడ్జెట్ కేవలం 2.1 కోట్లు మాత్రమే. అందులో పారితోషికాలు తీసేస్తే కేవలం కోటి ముప్పై లక్షలలో ఈ సినిమాను తీశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించింది. మా టీవీలో ఈ మధ్య ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 4.05 (అర్బన్) రేటింగ్ తీసుకొచ్చింది. అది కూడా నాన్-ప్రైమ్ టైమ్ లో కావటం గమనార్హం. ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ ఆదివారం మధ్యాహ్నం సమయంలో ప్రసారం చేసింది. 

రెగ్యులర్ గా సినిమాలకు మంచి రేటింగ్స్ రావాలంటే సాయంత్రం ప్రైమ్ టైమ్ లో ప్రసారం చేస్తుంటారు. కానీ మధ్యాహ్నం టైమ్ లో టెలికాస్ట్ చేసినా కూడా అద్భుతమైన టిఆర్పి తీసుకొచ్చింది మత్తు వదలరా. అందుకు కారణం చాలా మంది ఈ చిన్న సినిమాని థియోటర్ లో చూద్దామనుకుని చూడలేకపోవడం. దాంతో అమెజాన్ తో పాటు టీవీలో రాగానే చాలా మంది చూశారు. అందుకే ఈ రేటింగ్ వచ్చింది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీసారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరోగా.. పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏదేమైనా కూడా ఈ మధ్య ఒక చిన్న సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించడం మాత్రం నిజంగానే విశేషం. 

More Related Stories