English   

అల్లు అర్జున్ విజయ్ సేతుపతి..ఆ వార్తల్లో నిజం లేదట

vijay sethupathi
2020-03-16 14:04:40

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో  అలవైకుంఠపురములో సినిమా చేసి చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి కేరళ అడవుల్లో బన్నీ లేకుండా ఉన్న సీన్స్ తో పూర్తి కాగా అతి త్వరలో రెండవ షెడ్యూల్ కూడా మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొనబోతోందని చెబుతున్నారు. అయితే కరోనా దెబ్బకు ఆ షూట్ కొంచెం వాయిదా పడే అవకాశం ఉంది. 

ఇక ఈ సినిమాని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు కూడా మంచి వర్త్ ఉండడంతో ఆ పాత్రకు కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేసారని ఆయనకు భారీ ఎత్తున రెమ్యునరేషన్ ముట్ట చెబుతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో అసలు ఎలాంటి వాస్తవం లేదని చెబుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఈ సినిమాకు గాను మొత్తంగా రూ.కోటిన్నర దాకా రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.  

More Related Stories