English   

ఈ దసరా మామూలుగా లేదుగా.. చిరంజీవితో పాటు మరో సూపర్ స్టార్..

Chiranjeevi Rajinikanth
2020-03-16 15:10:20

తెలుగు ఇండస్ట్రీకి సంక్రాంతి, సమ్మర్ తర్వాత అంతగా కలిసొచ్చే మరో సీజన్ దసరా. ఏకంగా 15 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి అప్పుడు సినిమాలు తీసుకొస్తే కాస్త యావరేజ్ టాక్ వచ్చినా కూడా కచ్చితంగా ప్రేక్షకులు చూస్తారని నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉంటుంది. అందుకే చాలా సినిమాలు దసరాకు రావడానికి దాదాపు ఆరు నెలల ముందు నుంచి కర్చీఫ్ వేసుకొని ఉంటాయి. ఈ సారి కూడా అలాగే చాలా సినిమాలు దసరాకు రావడానికి పోటీపడుతున్నాయి. అందులో అందరికంటే ముందు కన్నడ సూపర్ స్టార్ యాష్ కేజిఎఫ్ 2 సినిమాతో వస్తున్నాడు. 

తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలు ఈ సీక్వెల్ కోసం వేచి చూస్తున్న తరుణంలో అక్టోబర్ 23న కేజిఎఫ్ 2 విడుదల అవుతుందని ఈ మధ్య అనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు. దాంతో మిగిలిన సినిమాలు కాస్త వెనకడుగు వేస్తున్నాయి. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య.. రజనీకాంత్‌ కొత్త చిత్రం అన్నాత్త కూడా దసరాకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సారి దసరా అక్టోబర్‌ 25 ఆదివారం వస్తోంది. 

రెండు రోజుల ముందే అంటే శుక్రవారం అక్టోబర్ 23న తమ సినిమాలు విడుదల చేస్తే లాంగ్ వీకెండ్ వస్తుందని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేజిఎఫ్ 2  ఈ విడుదల తేది కన్ఫర్మ్ చేసుకుంది. దాంతోపాటే చిరంజీవి, రజనీకాంత్ కూడా అదే రోజు రావాలని చూస్తున్నారు. ఈ సంక్రాంతికి ఒక రోజు గ్యాప్ లో రెండు భారీ సినిమాలు వచ్చి సంచలన విజయం అందుకున్నాయి. దాంతో సెలవులు ఉన్నప్పుడు మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు చూస్తారని ఈ సంక్రాంతి నిరూపించింది.

దాంతో ఇప్పుడు దసరాకు కూడా ఇదే జరుగుతుందని నమ్ముతున్నాడు దర్శక నిర్మాతలు. అందుకే కేజిఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమా వస్తున్నా కూడా దానికి పోటీగా చిరంజీవి, రజనీకాంత్ రావాలని చూస్తున్నారు. ఇందులో రజనీకాంత్ కూడా దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాడు. ఈసారి దసరాకు ఎటు చూసుకున్న కూడా త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ఒకవేళ ఇదే జరిగితే ఎవరు విన్నర్ అవుతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. 

More Related Stories