English   

కరోనాను చూసి భయపడొద్దు.. రాజమౌళి సూచనలు.. 

Rajamouli
2020-03-16 17:15:41

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తుండటంతో ఇప్పుడు దీనిపై కొన్ని సూచనలు ఇచ్చాడు దర్శకధీరుడు. జక్కన్న చెప్పినట్లు చేస్తే కరోనా రమ్మన్నా రాదేమో..? అంతగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాడు ఈయన. కరోనా సోకకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాజమౌళి కోరుతున్నాడు. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలపై దృష్టి సారించి ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు కూడా. బయటికి రాకుండా ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాలని ఆదేశించింది. మార్చ్ 31 వరకు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు. దాంతో కర్ఫ్యూ వాతావరణం రోడ్ల మీద కనిపిస్తోంది. ఇప్పుడు రాజమౌళి కరోనా వైరస్‌పై కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఈయన ట్విట్టర్ లో దీనికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. కరోనా కారణంగా ప్రపంచం నిలిచిపోవడం చూస్తుంటే షాకింగ్‌గా అనిపిస్తుందని చెప్పాడు ఈయన. 

ఇలాంటి పరిస్థితుల్లో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఆయన కోరుతున్నాడు. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను పాటిస్తే అంతా బాగుంటారని చెప్పాడు ఈయన. ప్రస్తుతం ఈయన RRR సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయింది. సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయనున్నారు. కరోనా ఉండటంతో ఔట్ డోర్ షూట్ మానేసి.. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు

More Related Stories