English   

ట్విట్టర్ పాస్ వర్డ్ మర్చిపోయిన రష్మిక

rashmika
2020-03-16 19:52:12

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాయికల్లో రష్మిక ఒకరు. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలు అప్లోడ్ చేయడమే కాక తన సినిమా అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. అలా ఉండి ఒక సరి సుల్తాన్ అనే టైటిల్ రివీల్ చేసి తిప్పలు కూడా తెచ్చుకుంది అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు సంగతి ఏమిటంటే ఆమె కొన్ని రోజులుగా సోషల్ మీడియాకి దూరం అయిపొయింది. అదేమిటి అనుకుంటున్నారా ? అవునండీ ఆమె కొన్ని రోజులుగా అంటే పదిరోజులుగా ట్విట్టర్ నాలుగు రోజులుగా ఇన్స్టా అకౌంట్ లు ఓపెన్ చేయడం లేదు. ఆమె ట్విట్టర్‌కు దూరంగా ఉండటంతో అభిమానులు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రష్మిక తన ట్విట్టర్ పాస్వర్డ్ను మరచిపోయినట్లు ఉందని కామెంట్ చేస్తూనే ఆమెను తాము ఎంతగా మిస్ అవుతున్నామో తెలియ చేస్తున్నారు. ఏకంగా హ్యాష్‌ట్యాగ్‌లు #ComeBackRashmika పేరుతో ట్విట్టర్‌ లో ట్రెండ్ కూడా చేస్తున్నారు. ట్విట్టర్‌లో మార్చి 6న మిలియన్ ఫాలోవర్లకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆమె మార్చి 7న వెంకీ కుడుముల ట్వీట్‌ ని రీట్వీట్ చేసింది రష్మిక. ఆ తరువాత ఒక్క పోస్ట్ కానీ ఆమె చేయలేదు. ఈ ఏడాది మొదట్లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో నటించేందుకు సిద్దమవుతోంది. అలాగే ఆమె ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న సినిమాలో కూడా హీరోయిన్‌ గా ఫైనల్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. దీని మీద ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More Related Stories