English   

కరోనా వైరస్ రాకుండా ఇలా చేయండి.. చరణ్, ఎన్టీఆర్ జాగ్రత్తలు..

ntr
2020-03-17 06:36:20

ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రాజమౌళి యూనిట్ మాత్రం భయపడటం లేదు. వాళ్లు తమ పని తాము చేసుకుంటున్నారు. ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ప్రజలు కరోనా వైరస్ బారిన పడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక కొందరు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కొన్ని జాగ్రత్తలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో చరణ్ ఎన్టీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

ఎన్టీఆర్‌ : చేతులు సబ్బుతో మొచేతి వరకు కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడో, భోజనానికి ముందో.. కనీసం ఇలా రోజుకు 7-8 సార్లు.

రామ్‌చరణ్‌ : కరోనా వైరస్‌ తగ్గేవరకు తెలిసిన వాళ్లు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం. ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేళ్లు పెట్టుకోవడం కూడా మానేయాలి.

ఎన్టీఆర్‌ : మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు వేసుకోవాలి. ఏమి లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్‌-19 మీకు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతిని కాకుండా.. మొచేతిని అడ్డం పెట్టుకుండి.

రామ్‌చరణ్‌ : జనం ఎక్కువగా ఉండే చోటుకు వెళ్లకండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. గడగడ అని తొందరగా తాగేకన్నా ఎక్కువసార్లు కొంచెం, కొంచెం సిప్‌ చేయండి. వేడి నీళ్లు అయితే ఇంకా మంచింది.

ఎన్టీఆర్‌ : వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తను నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్‌ చేయకండి. అనవసరంగా భయానక పరిస్థితులు నెలకొంటాయి. ఇది వైరస్‌ కన్నా ప్రమాదకరం. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో ఇచ్చే సూచనలను ఫాలో అవుదాం.

రామ్‌చరణ్‌ : కోవిడ్‌-19 మీద ప్రభుత్వం ఇచ్చే సలహాలు, అప్‌డేట్స్‌ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే రక్షించుకుందాం. మొత్తానికి kovid 19 గురించి జనాలను బాగానే అప్రమత్తం చేస్తున్నారు రాజమౌళి సినిమా యూనిట్.

 

More Related Stories