English   

సంచలన పాత్రలో రమ్యకృష్ణ.. మరోసారి నీలాంబరి తరహాలో..

ramyaKrishna
2020-03-17 07:11:11

బాహుబలి సినిమాకు ముందు రమ్యకృష్ణను నీలాంబరి అని పిలిచేవాళ్ళు. అప్పట్లో నరసింహా సినిమాలో ఆమె చేసిన కారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆ తర్వాత మళ్లీ పోవడానికి 20 ఏళ్లు పట్టింది. బాహుబలిలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మరింత పేరు తెచ్చుకుంది. అయితే అందులో కూడా కొన్ని నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి. కానీ పూర్తిగా మాత్రం కాదు. పరిస్థితులకు తగ్గట్లు మారిపోయే పాత్ర అది. కానీ ఇప్పుడు మరోసారి రమ్య విలన్‌గా నటించబోతుందని తెలుస్తుంది. విలనిజం ఉంటే రమ్యకృష్ణ రప్ఫాడిస్తుందని తెలుసు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలోనే ఆమె మళ్లీ కనిపించబోతుంది. మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో ఓ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటించబోతుంది రమ్యకృష్ణ. ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే డ్రామా. శివగామి తర్వాత అంత ఇంపాక్ట్ ఉన్న పాత్ర చేయని రమ్యకృష్ణ.. ఇప్పుడు సాయి సినిమాతో మరోసారి అది చేసి చూపిస్తుందని నమ్ముతున్నారు అభిమానులు. మరి ఈ కారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలిక.

More Related Stories