English   

నాగ చైతన్యకు బెడ్రూమ్‌లో సమంత కంటే ఇష్టమైంది ఉందంట..

nag
2020-03-17 07:29:28

ఎవరైనా సరే.. పది మంది ముందు పడక గది విషయాలు మాట్లాడాలంటే కాస్త సిగ్గు పడతారు. కానీ కొందరు మాత్రం అలా కాదు. అంతా ఓపెన్. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా అంతే. అక్కినేని కోడలు ఓ విషయం మాట్లాడాలని ఫిక్సైపోతే అస్సలు సిగ్గు పడదు.. మొహమాటం అస్సలే పడదు. ఇప్పుడు కూడా ఇదే చేసింది సమంత అక్కినేని. తాజాగా తన బెడ్రూమ్ విషయాలను మరోసారి 70 ఎంఎం రేంజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఆ మధ్య మంచు లక్ష్మి షోలో కొన్ని చెప్పిన ఈమె.. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో మరిన్ని చెప్పుకొచ్చింది. వాళ్ళ పడకగది రహస్యాలతో పాటు మిగిలిన విషయాలపై కూడా సమంత బాగానే ఓపెన్ అయిపోయింది. అప్పట్లో ఆ షోలో ముఖ్యంగా పెళ్లికి ముందు వాళ్ళు చేసిన డేటింగ్ విషయాలు చెప్పమంటూ అడిగింది మంచు లక్ష్మి. దీనిపై సమంత అక్కినేని కూడా ఓపెన్ అయింది. ముఖ్యంగా నాగచైతన్యకు తాను రెండో భార్య అని మొదటి భార్య వేరే ఉన్నారు అంటూ చెప్పి సంచలనం సృష్టించింది సమంత. ఇంతకీ నాగచైతన్య మొదటి భార్య ఎవరు అనుకుంటున్నారా.. అతడి బెడ్ పై ఉండే పిల్లోస్. చివరికి తనను నేను ముద్దు పెట్టుకోవాలనుకున్నా కూడా మా మధ్య అడ్డుగా పిల్లోస్ ఉంటాయి అని ఓపెన్ గా సమాధానం చెప్పింది. అంతేకాదు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపించే నాగ చైతన్యకు ఉన్న కోపాన్ని ఎవరు చూడలేదని చెబుతోంది సమంత అక్కినేని. ఆయనకు పిల్లులు జంతువులు అంటే చాలా ప్రేమ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి పడకగది విషయాలు పదిమంది ముందు చెప్పి సమంత మరోసారి సంచలనం సృష్టించింది.

 

More Related Stories