English   

విశాల్ తో డేటింగ్ నిజమే...త్వరలో పెళ్లి

jwala
2020-03-17 08:10:03

గుత్తా జ్వాల అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరేమో. సింగిల్స్ లో సింధు, సైనాలు ఎంత ఫెమస్సో డబుల్స్ విభాగంలో ఈమె అంత ఫేమస్. ఈ హైదరాబాదీ స్టార్ షట్లర్ భారత్ కు ఎన్నో మరుపురాని విజయాలను అందించింది. అయితే ఆమె తన ఆట కన్నా ఎక్కువగా వివాదలాతోనే ఫేమస్ అయిందని చెప్పచ్చు. సానియా ఎలా అయితే ఆట కంటే అందంతో ఫేం తెచ్చుకుందో, ఒక రకంగా ఈమె కూడా అదే కోవకు చెందిన మనిషి అని చెప్పవచ్చు. అయితే ఈమె కొద్ది రోజులుగా దేశానికి ఆడడం మానేసింది. ఎలా అయితే పుల్లెల గోపీచంద్ అకాడమీ పెట్టుకున్నాడో ఈమె కూడా అలానే ఒక అకాడమీ పెట్టుకుని దానిని మంచి పొజిషన్ లో పెట్టాలని యోచిస్తోంది. అయితే కొన్నాళ్ళగా ఆమె తమిళ హీరో విష్ణు విశాల్ లో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోంది.

అపట్లో ఈ విషయం గురంచి ఆమెను అడిగితే ఆయ్ అదంతా పర్శనల్ అని తెగేసి చెప్పింది. ఇప్పుడేమో తాము డేటింగ్ లో ఉన్నామని చెబుతోంది. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఒక్కటవుతామని భావిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఇక సైనా రాజకీయ తెరంగ్రేటం చేసినప్పుడు ఆమె మీద కామెంట్స్ చేసిన ఈవిడను రాజకీయాల గురించి కదిలిస్తే జాతీయ పార్టీల నుంచి పిలువు వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది. తన భావజాలానికి ఇప్పుడున్న పార్టీలతో సరిపడదని తన వ్యవహార శైలి ఎవరికీ నచ్చదని, ఇప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఈమె గతంలో తన సహచర ఆటగాడు చేతన్ ఆనంద్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఐదారేళ్ళు కాపురం చేసిన పిదప మనప్సర్దలతో వీరు విడిపోయారు.

 

More Related Stories