English   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై నాగబాబు సెటైర్లు..

jagan
2020-03-17 08:17:50

నాగబాబు ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా. తమ్ముడు జనసేన పార్టీ కోసం ఆయన కూడా పని చేస్తున్నాడు. ముఖ్యంగా అధికార పార్టీపై ఎప్పటికప్పుడు తన మార్కు సెటైర్లు వేస్తూ ఉంటాడు నాగబాబు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు. ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడటంతో సీఎం జగన్ సీరియస్ అయ్యాడు. దాంతో జగన్‌పై జనసేన పార్టీ నేత, నటుడు నాగబాబు సెటైర్స్ వేశాడు. ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోంది. ఆ వైరస్ బారిన పడకుండా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడం కూడా మానేశారు. దానికి తోడు కొందరు ఆ లక్షణాలతో హాస్పిటల్ కి క్యూ కడుతున్నారు. అందుకే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను కేవలం ఇంటికే పరిమితం చేసేలా ఆజ్ఞలు జారీ చేశారు. అందులో భాగంగానే మార్చ్ 31వ తేదీ వరకూ అన్ని బంద్ చేశారు. బయట ఇక్కడ జనాలు గుంపులు గుంపులుగా కనపడకూడదని ఆర్డర్స్ పాస్ చేశారు.

దీనికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ప్రభుత్వ అధికారుల నుంచి ప్రజలకు తెలియజేసేలా చేస్తున్నాయి ప్రభుత్వాలు. బయట పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. దీనిపై సీఎం జగన్ చాలా సీరియస్ అయ్యాడు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి ఎందుకు.. ప్రభుత్వం ఎందుకు అంటూ ఆయన ఎలక్షన్ కమిషన్ ను ఓ రేంజ్ లో విమర్శించాడు. ఇక ఎన్నికలు ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో ఈసీ కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారుతోంది. అధికార పక్షంపై.. ప్రతిపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాగబాబు కూడా ముఖ్యమంత్రిపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.'ఎన్నికల కన్నా, మన డబ్బు కన్నా ,మన వ్యాపారాలకన్నా, మన పదవుల కన్నా, ఇలా అన్నిటికన్నా.. మనిషి ప్రాణాలు ముఖ్యం కదా..! ఎన్నికలు ఆపలేదు.. వాయిదా వేశారు. ఈ ఎలక్షన్ అకౌంట్‌లో కరోనా ఎఫెక్ట్‌కి ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా. అయినా వైసీపీ వాళ్ళకి.. వాళ్ళ సపోర్టర్స్‌కి ఎందుకు ఇంత బాధ'.. అంటూ ట్వీట్ చేశాడు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

More Related Stories