English   

దళపతి విజయ్ ముందు కరోనా వైరస్ జుజుబి.. 

Master Audio
2020-03-17 09:55:01

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తుంది. ఆ వైరస్ వ్యాపించకుండా మార్చ్ 31 వరకు అన్ని ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. అందులో భాగంగానే పెద్ద పెద్ద ఈవెంట్స్, పెళ్లిళ్లు కూడా కాన్సిల్ చేసుకోవాలని కోరారు. ఒక్కరికి వస్తే అందరికీ వ్యాపిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ విజయ్ మాత్రం తన మాస్టర్ సినిమా ఆడియో వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్, లాంటి ఇతర ఈవెంట్ లకు వేలాది సంఖ్యలో అభిమానులు వస్తారు. విజయ్ సినిమాకు కూడా ఇదే జరిగింది. 

తమిళనాడులో ఈ అభిమానం మరింత ఎక్కువగా ఉంటుంది. వాళ్ల అభిమానానికి హద్దులుండవు. విజయ్ సినిమా మాస్టర్ ఆడియో వేడుకకు వేలాది మంది వచ్చారు. అయితే కరోనా వైరస్ అనేది ఒకటుందని.. ప్రపంచాన్ని అది వణికిస్తుందని వాళ్లు మరిచిపోయారు. విజయ్ అనే పేరు ముందు కరోనా వైరస్ ను పూర్తిగా మరిచిపోయారు తమిళ తంబిలు. ఇండియాలో ఇప్పటికే 110 మందికి పైగా కరోనా వచ్చింది. అయినా కూడా వాళ్ళకేం పట్టడం లేదు. దళపతి విజయ్ హీరోగా.. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించిన మాస్టర్ సినిమా ఆడియో లాంచ్ కు చాలా మంది వచ్చారు. 

అసలు ఈ వేడుక అనౌన్స్ చేసినపుడు వస్తారా రారా అనుకున్నారు కానీ వేలల్లో ఫ్యాన్స్ రావడంతో విజయ్ ముందు కరోనా తలవంచింది. ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. అతడి భార్య కూడా వచ్చింది. అయితే ఇలాంటి పెద్ద వేడుకలు జరపొద్దని ప్రకటించిన తర్వాత కూడా మళ్లీ అలా చేయడం ఏంటి అంటూ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు విజయ్ పై సీరియస్ అవుతున్నాయి. అక్కడ ఒక్క కరోనా పేషెంట్ ఉన్నా కూడా మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ఆయన్ని నిలదీస్తున్నారు. మొత్తానికి మాస్టర్ ఆడియో వేడుకతో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు విజయ్. లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎప్రిల్లో విడుదల చేయనున్నారు. కరోనా కాస్త తగ్గిన తర్వాత మాస్టర్ రానున్నాడు. 

More Related Stories