సినిమాలతో బిజీ అవుతున్న రంగమ్మత్త..

బుల్లితెరను తన అందాలతో మత్తుగా తడిపేసిన బ్యూటీ అనసూయ. యాంకర్ అనే పదానికి అర్థాన్ని మార్చేసింది ఈమె. పద్దతిగా ఉండాలి.. చెప్పెళ్లాలి.. చెప్పులేసుకెళ్లాలి లాంటి పద్దతులన్నీ తీసి పక్కనబెట్టింది అను. చీరకట్టులో కనిపించాలనే రూల్స్‌కు బ్రేక్ చెప్పి ట్రెండీగా మారిపోయింది. తెలుగు ఆడియన్స్ అప్పటి వరకు చూడని అందాల యాంకర్‌ను బుల్లితెరపై చూపించింది అనసూయ. పెళ్లి తర్వాత యాంకరింగ్ లోకి వచ్చిన అనసూయ.. మిగిలిన యాంకర్లు అసూయ పడేలా ఎదిగిపోయింది. అన్నింటికీ అందాలనే పెట్టుబడిగా పెట్టేసింది.
అందాల ప్రదర్శనలో మాత్రం ఇప్పటి హీరోయిన్లు కూడా పనికిరారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. వయసు ఉండగానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేనకేసుకోవాలి.. ఆ క్రేజ్ కాస్తా పోయిందంటే చూసేవాళ్లు కూడా ఉండరు. ఇదే ఇప్పుడు అనసూయ ఫాలో అవుతోన్న రూట్. ఈ భామకు తెలుసు.. జీవితంలో తాను ఎప్పటికీ స్టార్ హీరోయిన్ అవ్వనని. అందుకే ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది ఈ భామ. సింపుల్ గా హీరోయిన్లకు ధీటుగా హాట్ ఫోటోషూట్లతో మత్తెక్కిస్తోంది అను ఆంటీ.
పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా హాట్ షోకు ఏ మాత్రం వెనకాడకుండా ఇరగదీస్తోంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటు సినిమాలు కూడా బాగానే చేస్తుంది. మరో యాంకర్ రష్మి మాదిరి ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది. చేసేవి కొన్ని సినిమాలే అయినా కూడా గుర్తింపుతో పాటు గుర్తుండిపోయేలా చేస్తుంది. అలా చేసిన సినిమాలే రంగస్థలం, క్షణం కూడా. ఇప్పుడు కూడా సుకుమార్, బన్నీ సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది. దాంతో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అంధాధూన్ రీమేక్‌లో టబు హిందీలో పోషించిన పాత్రలో కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది. కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకునే డేరింగ్ రోల్ అది. మొత్తానికి అనసూయ కెరీర్ ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లే ఉంది.