English   

పండు గాడి డైలాగులు థియేటర్లో మరోసారి వింటారా..

14 Years of Pokiri
2020-03-17 11:58:36

తెలుగు ఇండస్ట్రీకి కొత్త లెక్కలు నేర్పించిన సినిమా పోకిరి. అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ కేవలం 20 కోట్ల నుంచి 30 కోట్ల మధ్యలోనే ఉండేది. అలాంటి సమయంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి ఏకంగా 40 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. 200 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ సినిమా. నిజం చెప్పాలంటే పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైన పోకిరి అప్పటి వరకు ఉన్న ప్రతి రికార్డును తన పేర రాసుకుంది. 

పూరి జగన్నాథ్ మాస్టర్ టేకింగ్.. మహేష్ బాబు స్టైలిష్ యాక్టింగ్.. ఈ సినిమాను ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టాయి. మణిశర్మ సంగీతం.. ఇలియానా అందాలు.. పూరి జగన్నాథ్ డైలాగులు.. బ్రహ్మానందం, ఆలీ కామెడీ సీన్స్ ఇలా పోకిరి సినిమాకు ప్రతి ఒక్కటి వర్కవుట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు మహేష్ బాబు. ఇలాంటి అద్భుతమైన సినిమాను మరోసారి థియేటర్ లో చూసే అవకాశం అభిమానులకు కల్పించబోతున్నాడు దర్శక నిర్మాత పూరి జగన్నాథ్. ఈ ఏడాది ఏప్రిల్ 27తో పోకిరి సినిమా విడుదలై 14 ఏళ్లు పూర్తి అవుతుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా స్పెషల్ షో ఏప్రిల్ 28న ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ అనే పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐమాక్స్ లో ప్రత్యేకంగా ఒక షో వేశారు. దీనికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు పోకిరి సినిమాకు కూడా ఇదే చేయాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్. అలా పోకిరి సినిమాను మరోసారి థియేటర్ లో చూడాలనుకునే వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నాడు పూరి. మరి పండు గాడి డైలాగులను మరోసారి ఎంజాయ్ చేసి రండి.

More Related Stories