English   

కరోనా బాహుబలిని కూడా భయపెట్టిందిగా 

Prabhas20
2020-03-17 12:44:07

కరోనా వైరస్ (COVID -19) మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే తమకేమీ కాదంటూ యూరప్ లోన్ జార్జియాలో ప్రభాస్ రాధే యూనిట్ షూటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆపేసినట్టు చెబుతున్నారు. యూరోప్ అంతా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకునట్టు చెబుతున్నారు. ఈ యూనిట్ అంతా ఈ ఉదయం ఇండియాకి బయలు దేరనుంది రేపు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే ముందు వీరు కరోనా ఉన్నా షూట్ చేయడం వలన విమర్శల పాలయ్యారు. 

అయితే అవేమీ పట్టించుకోకుండా షూట్ చేసిన అక్కడి వాతావరణంలో ఎక్కువ ఈ వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో ఎందుకొచ్చిన రిస్క్ అనుకున్న ప్రభాస్ 20 టీమ్ అంతా వెనక్కి రావాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇటలీ మరియు హైదరాబాద్లలో చెరొక షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్ మార్చి 10న జార్జియా చేరింది. ప్రత్యేకంగా నిర్మించిన ఫ్లీ మార్కెట్ సెట్లో ప్రభాస్, పూజా హెగ్డే మరియు ప్రియదర్శి పుల్లికొండ వంటి వారి మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక హస్త రేఖా జ్యోతిష్యుడు అని, పూజా స్కూల్ టీచర్ పాత్రను పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయచ్చని చెబుతున్నారు.
 

More Related Stories