English   

షాహిద్ కపూర్ తో సానియా ప్రేమాయణం..ఇప్పుడు వెలుగులోకి

Sania Mirza
2020-03-17 13:08:13

బాలీవుడ్ హీరో, ప్లే బాయ్ షాహీద్ కపూర్ సానియాల మధ్య ఉన్న అఫైర్ ఇప్పుడు వైరల్ అయింది. అదేమిటి అంటే ఒకప్పుడు వీరు డేటింగ్ చేశారనే విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే షాహిద్ సినిమాలతో సంబంధం లేకుండా లవ్ రిలేషన్స్‌ మాత్రం ఒక ప్లే బాయ్ లెక్కన మెయింటెన్ చేశాడు. షాహిద్ లైఫ్‌లోకి ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ లాంటి వాళ్లు వచ్చి పోయారు. అయితే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిందేమిటంటే.. కరీనాతో విడిపోయిన తర్వాత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో డేటింగ్ చేశారట. ఎందుకో కానీ ఈ వ్యవహారం మీడియాలో పెద్దగా ఎక్స్ పోజ్ కాలేదు. ఆ విషయాన్ని కరణ్ జోహర్ ఇప్పుడు పేర్కొనడం ఇప్పుడు హైలైట్ గా మారింది.

ప్రేమలో మునిగి తేలుతున్న ఉన్న షాహిద్, కరీనా కపూర్‌కు జబ్ వీ మెట్ సినిమా షూటింగ్‌లో విభేదాలు తలెత్తాయి. దాంతో వారిద్దరూ విడిపోవడం, ఆ తర్వాత వెంటనే సైఫ్‌తో కరీనా రిలేషన్ పెట్టుకోవడం అనేది మీడియా కంట పడేలా జరిగాయి. అయితే కరీనా సైఫ్ తో రిలేషన్ లోకి వెళ్ళే సమయలోనే షాహిద్, సానియా ల మధ్య కూడా ఒక బాండింగ్ ఏర్పడిందట. 

ఈ విషయాన్ని కరణ్ జోహర్ తన షోలో సానియాతో షాహిద్ ప్రేమ గురించి ప్రస్తావించినప్పుడు ఆమె మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అయినా వదలని కరణ్ మీరిద్దరూ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చాయి కదా అవి నిజమేనా అంటూ మళ్ళీ అడిగాడు. దేన్తొహ్ ఆమెకు చెప్పా తప్పలేదు. షాహిద్‌ తో డేటింగ్ చేసిన విషయం నాకు సరిగా గుర్తుంచుకోలేదన్న ఆమె ఆ తరువాత నా జీవితంలో చాలా దూరం ప్రయాణం చేశానని, ఇప్పుడు ఆ విషయం నాకే గుర్తుకు రావడం లేదని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంది. నిజానికి సానియా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ ని పెళ్లి చేసుకున్నన సంగతి తెలిసిందే.  

More Related Stories