English   

గ్లామర్ డోస్ పెంచేసిన యాంకర్ విష్ణుప్రియ...టూ హాట్ గురూ

Vishnu Priya
2020-03-17 14:39:58

వెండితెరపై కానీ బుల్లితెరపై కానీ రాణించాలంటే అందం ఒక్కటే చాలదు, దానికి తోడు టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఖచ్చితంగా ఉండాలి. అలా అన్నీ ఉండబట్టే ఇప్పుడు బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకెళ్తోంది యాంకర్ విష్ణుప్రియ. బుల్లితెరపై ఇప్పటికే యాంకర్ అనసూయ, రష్మి, శ్రీముఖి, సుమ లాంటి వారికి తగ్గట్టే ఈ భామ చేసేది ఒక్క షో అయినా వారికి పోటీ ఇస్తుంది విష్ణు ప్రియ. పోవే పోరా అనే ప్రోగ్రాంలో సుధీర్ కు జోడిగా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఈభామ. ఈ ప్రోగ్రాం ద్వారానే యాంకర్ గా ప్రేక్షకులకు దగ్గరైంది విష్ణుప్రియ. అంతకుముందు ఈమె కొంత వరకే తెలుసు, ఎందుకంటే ఆమె ఈ ప్రొగ్రాం కంటే ముందు షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లలో నటించింది. కానీ ఆమెకి వాటివలన బ్రేక్ రాలేదు. 

ఇప్పుడు ఈ పోవేపోరా ప్రొగ్రాంతో తన స్పాంటేనియస్ పంచులు, కుర్రకారు మెచ్చే డ్రెస్సింగ్, చేష్టలతో తనదైన ముద్ర వేసుకుంటోంది. యాక్టింగ్ స్కిల్స్ తోనే కాకుండా ఇలా హాట్ స్టిల్స్ తో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంటోంది ఈ భామ. విష్ణు ప్రియ ముక్కు కాస్త పెద్దదిగా ఉండటంతో కామెడీని పండించడానికి అంతా దానిని టార్గెట్ చేస్తున్నారనుకోండి. ఈ మధ్య ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు కాక రేపుతున్నాయి. మరి సినిమా అవకాశాలు ఏమయినా వస్తాయి అనుకుంటుందో ఏమో కానీ పూర్తిగా హాట్ బాంబ్ లాగా తయారయ్యింది ఈ భామ. ఇలా తెలుగు యాంకరింగ్ చేసి అనసూయ, రష్మీ, శ్రీముఖిలు సినిమా ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరిలో అనసూయ ఒక్కతి కాస్త మంచిగా క్లిక్ అయింది. మరి విష్ణు ప్రాయ అందాల ఆరబోత ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూద్దాం.  

More Related Stories