English   

హైకోర్ట్‌కెక్కిన కమల్...వారు వేధిస్తున్నారంటూ 

Kamal Haasan
2020-03-17 15:13:21

నటుడు కమల్‌హాసన్ మద్రాస్‌ హైకోర్ట్‌ కెక్కారు. భారతీయుడు-2 షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై విచారణ పేరుతో తనను వేధిస్తున్నారంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు కమల్‌హాసన్‌.  అత్వవసర విచారణ కింద పిటిషన్‌ను స్వీకరించింది హైకోర్ట్‌. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతుండగా క్రేన్ ఊడి కింద పడింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక ప్రొడక్షన్ పర్సన్, మరొకరు శంకర్ పర్సనల్ స్టాఫ్ ఉన్నారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

అయితే డైరెక్టర్ శంకర్ కు కాలు కూడా విరిగింది. షూటింగ్ లో ఉన్న కమల్ హాసన్, హీరోయిన్ కాజల్ లు కూడా ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు కూడా అప్పట్లో కమల్. అనంతరం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి కుటుంబాలకు హీరో కమల్ హాసన్ రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని వారికి ప్రాణాలకు ఇస్తున్న పరిహారంగా చూడొద్దని కూడా అప్పట్లో ఆయన కోరారు. ముగ్గురు బాధితుల కుటుంబాలకు తాను అండగా నిలుస్తానని, ఇలాంటి ఘటనల్లోంచి కోలుకోవడం ఎంతటి కష్టమో తనకు వ్యక్తిగతంగా తెలుసని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన మీద నిర్మణ సంస్థతో పాటు డైరెక్టర్ శంకర్, హీరో కమల్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసు మీదనే తనను వేధిస్తున్నారని కమల్ కోర్టుకు ఎక్కాడు. 

More Related Stories