English   

అల్లు అర్జున్ నిర్మాతలకు అంత కక్కుర్తి ఎందుకు..

Ala Vaikunthapurramuloo
2020-03-17 16:52:25

అచ్చంగా ఇప్పుడు ఇదే అడుగుతున్నారు కొందరు నెటిజన్లు.. అభిమానులు కూడా అల్లు అర్జున్ నిర్మాతలు చేసిన పనికి కాస్త ఫీలవుతున్నారు. అసలు విషయం ఏంటంటే సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన అల వైకుంఠపురంలో సినిమాలోని ఒక డిలీటెడ్ సీన్ ఇప్పుడు యూ ట్యూబ్లో విడుదల చేశారు. నిర్మాతలు సాధారణంగా ప్రతి సినిమాకు అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువ సన్నివేశాలు వస్తాయి. సినిమాలో అవసరం ఉందా లేదా అని బేరీజు వేసుకొని దర్శక నిర్మాతలు వాటిని ఎడిట్ రూముల్లో కూర్చుని తీసేస్తారు. అలా మిగిలిపోయిన డిలీటెడ్ సన్నివేశాలను యూ ట్యూబ్ ఆదాయం కోసం చిన్న సినిమా నిర్మాతలు విడుదల చేస్తుంటారు. 

అప్పుడప్పుడు పెద్ద సినిమాల దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాల్లో లేని డిలీటెడ్ సీన్స్ యూ ట్యూబ్ లో అభిమానుల కోసం అప్లోడ్ చేస్తుంటారు. అయితే పూర్తిగా డబ్బింగ్ చెప్పి మంచి వాయిస్ తో ఉన్న సన్నివేశాలు మాత్రమే యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తారు. కానీ ఇప్పుడు హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన అల వైకుంఠపురంలో సినిమాలోని ఒక డిలీటెడ్ సన్నివేశం డబ్బింగ్ లేకుండా ఆన్ లొకేషన్ వాయిస్ తో వచ్చింది. అందులో అల్లు అర్జున్, సుశాంత్ మధ్య ఒక సన్నివేశం చిత్రీకరించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

స్విమ్మింగ్ పూల్ సుశాంత్ ఈత కొడుతుంటే ఆయన దగ్గరికి వచ్చి సిగరెట్, మందు తాగే వీడియోను బన్నీ చూపిస్తాడు. ఆ వీడియో చూపించి సుశాంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తాడు అల్లు అర్జున్. కానీ అందులో వాయిస్ సరిగ్గా లేదు. కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు. అల్లు అర్జున్ వాయిస్ క్లారిటీ ఉండదు. పక్కనుంచి నాయిస్ కూడా వస్తుంది. కేవలం యూ ట్యూబ్ లో వచ్చే డబ్బు కోసం ఇలాంటి వీడియోను అప్లోడ్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మెగా అభిమానులు కూడా దీనిపై కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ నిజంగానే డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్ లో పెట్టాలి అనుకున్నప్పుడు డబ్బింగ్ చేసి ఉంటే బాగుండేది అంటున్నారు వాళ్లు. మరి దీనిపై దర్శక నిర్మాతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. 

More Related Stories