English   

ఆ ట్రోల్స్ బాగా ఎంజాయ్ చేసానంటున్న కియారా అద్వానీ..

Kiara Advani
2020-03-17 19:17:54

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో నటించలేదు.. కానీ అప్పటికే బాలీవుడ్ లో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో కియారా అద్వానీ ఉత్తరాదిన క్రేజ్ బాగానే తెచ్చుకుంది. దానికి తోడు అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన గుడ్ న్యూస్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అందులో ఈమె కరీనా కపూర్ తో కలిసి నటించింది. 

ఇదిలా ఉంటే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. దానికి కారణం కూడా ఉంది. ఆ మధ్య ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ కోసం కియారా టాప్ లెస్ గా పోజిచ్చింది. ఒక ఆకును అడ్డం పెట్టుకొని పూర్తిగా నగ్నంగా ఉన్నట్లు ఈ ఫోటోషూట్ చేశాడు డబూ రత్నాని. ఈ ఫోటో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. 

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా అన్ని చోట్ల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది కియారా అద్వానీ ఫోటో. అదే స్థాయిలో ఈ ఫోటోపై ట్రోల్స్ కూడా జరిగాయి. నెటిజన్లు తమకు ఇష్టమొచ్చినట్లు మీమ్స్ క్రియేట్ చేశారు. అయితే ఇవన్నీ చూసిన కియారా ఆ ట్రోల్స్ ని చాలా ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. అంతే కాకుండా కొన్నింటిని తాను కూడా షేర్ చేశానని చెబుతోంది. ఈ ట్రోల్స్ తట్టుకోలేక ఒకసారి ఇంస్టాగ్రామ్ పేజీ ఆఫ్ చేశాను అంటోంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories