English   

పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

pk
2020-03-18 07:58:11

రెండేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. మరో రెండు నెలలు ఆగితే ఈయన నటించిన సినిమా విడుదలవుతుందని వాళ్ళు గాల్లో తేలిపోతున్నారు. దానికితోడు వకీల్ సాబ్ షూటింగ్ అనుకున్న దాని కంటే వేగంగా జరుగుతుండటంతో కచ్చితంగా మే 15న వస్తుందని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. కానీ ఇప్పుడు వాళ్లకు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమాను మే 15 నుంచి వాయిదా వేయాలని ఆలోచిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీలు మారిపోతున్నాయి. ఈ ఉగాదికి రాబోతున్న నాని 'వి' సినిమా విడుదల వాయిదా పడింది. ఇక ఇదే ప్రభావం ఇప్పుడు పవన్‌ కళ్యాణ్ సినిమా 'వకీల్‌ సాబ్' విడుదలపై కూడా వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

దిల్‌ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా మే 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రం విడుదల జూన్‌కి వాయిదా పడినట్టు తెలుస్తోంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై నిర్మాత దిల్ రాజు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ నిజంగానే వకీల్ సాబ్ విడుదల వాయిదా పడితే మాత్రం అభిమానులకు అది నిరాశ పరచే విషయమే.

More Related Stories