English   

ఆ విషయంలో సమంతను బాగా తిట్టిన నాగ చైతన్య...

Samantha Naga Chaitanya.jpg
2020-03-18 09:21:22

సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో ఈమె ముందు వరసలో ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ స్టార్ అనిపించుకోవడం అనేది చిన్న విషయం కాదు. సాధారణంగా హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తారు. కానీ సమంత మాత్రం కంటిన్యూ చేస్తుంది. భర్త సపోర్ట్ లేకుండా అది చేయడం చాలా కష్టం. అందులో తన భర్త తనకు ఎంతగా తోడుంటాడో చెబుతుంది అక్కినేని కోడలు.

పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించకపోగా ఇంకా స్పీడ్ పెంచేసింది ఈమె. అయితే గతంలో మాదిరి గ్లామర్ రోల్స్ కాకుండా కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే ఆమె నుంచి పెళ్లి తర్వాత యూ టర్న్, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, జాను లాంటి సినిమాలు వచ్చాయి. ఫలితంతో పని లేకుండా ఈ సినిమాలన్నీ సమంతకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా అనుష్క సైడ్ అయిపోవడంతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సమంత బెస్ట్ ఛాయిస్ అవుతుంది. భారీగా పారితోషికం కూడా ఆఫర్ చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పుడు మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ నెం.1గా నిలిచింది సమంత. ఈ క్రమంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది.

నిజానికి పెళ్లి తర్వాత అయిన వెంటనే సినిమాలకు గుడ్‌ బై చెప్పాలనుకున్నానని చెప్పింది సమంత. ఇదే విషయాన్ని చైతూకు చెప్తే నీకేమైనా మైండ్‌ పోయిందా.. బుర్ర పని చేస్తుందా లేదా అంటూ తనను తిట్టేసాడని గుర్తు చేసుకుంది సమంత అక్కినేని. సినిమాల్లో నటించే అవకాశం అందరికి రాదు.. వచ్చినా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకోవడం సాధ్యం కాదు.. అలాంటప్పపుడు వచ్చిన ఛాన్సులు ఎందుకు వదిలేసుకుంటావు అంటూ తనను ఎంకరేజ్ చేసాడని చెప్పింది సమంత. చైతూ ప్రోత్సాహమే లేకపోతే ఈ పాటికి సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయేదాన్ని అని చెబుతుంది ఈమె. ఈ ఆన్సర్ ఇవ్వడం వెనక కారణం కూడా ఉంది. చైతూకు ఇష్టం లేకుండా సమంత వరస సినిమాలు చేస్తుందని వస్తున్న విమర్శలకు దీంతో సమాధానం ఇచ్చింది స్యామ్.

తను సినిమాలు చేయడం వెనక మామ నాగార్జున సపోర్ట్ కూడా ఉందని చెప్పింది ఈమె. మొత్తానికి కుటుంబం అండదండలు లేకపోతే ఓ అమ్మాయి ఇంత ధైర్యంగా సినిమాలు ఎలా చేస్తుందని ప్రశ్నిస్తుంది సమంత. 

More Related Stories