English   

ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేసిన గోపీచంద్...కానీ

Gopichand
2020-03-18 11:37:01

ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపి కట్టెది ఒక దారి అంటుంటారు మన పెద్దలు. అంటే నలుగురూ నడిచే దారిలో కాకుండా మరో దారిలో వెళ్లాలని ప్రయత్నించే వారిని ఉద్దేశించి అలా అంటుంటారు. ఇప్పుడు అలానే అనిపించుకుంటున్నాడు మ్యాచో స్టార్ గోపీ చంద్. తాజాగా గోపీచంద్.. తన ఫ్యామిలీ హోళీ ఆడిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు. తన భార్య ఇద్దరు కుమారులతో ఉన్న ఈ ఫోటో చాలా క్యూట్‌గా ఉందని అందరూ కామెంట్ చేస్తున్నారు. 

ఎందుకంటే కరోన ఎఫెక్ట్ వలన అసలు హోలీ జరుపుకోవద్దని సర్కార్ ఆదేశించింది. ఎందుకంటే నీటి వలన అది వ్యాప్తి చెందుతున్నదేమోననే ఉద్దేశంతో అలా చెప్పారు. కానీ జరుపుకుంటూ ఫోటోలు పెట్టడం ఎందుకు అనే వాదన వినిపిస్తోంది. అందరూ కరోనా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసేలా పోస్ట్ చేస్తుంటే ఎప్పుడో జరిగిన హోలీ ఫోటోలు ఇప్పుడు పెట్టడం ఎందుకని కొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి గోపీచంద్ కొంతకాలంగా సక్సెస్ లేక బాగా వెనకబడిపోయారు. 

ఒకప్పుడు బడ్జెట్ హీరోగా ఉన్న గోపీచంద్ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. గడిచిన మూడేళ్లలో వరుసగా ఆరు డిజాస్టర్లను గోపీచంద్ అందించారు. 'జిల్' దగ్గర మొదలైన ఈ ఫ్లాప్ లు 'పంతం' వరకు కొనసాగింది. ప్రస్తుతం గోపీచంద్.. సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' సినిమా చేస్తున్నాడు. అది కాకా రజినీకాంత్.. శివ సినిమాలో కూడా ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికయినా మనోడు ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి.

More Related Stories