బాలయ్య మాటకి నో చెప్పిన బోయపాటి

కరోనా మహమ్మారి భారత్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ 139 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ముగ్గురు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బెంగాల్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఈ మహమ్మారి ధాటికి దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, పబ్లు, పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు మూతపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటూ యుద్ధప్రాతిపదికన ముందుకు సాగుతున్నాయి. అయినా మన వాళ్ళు షూటింగ్ ఆపమని అంటున్నారు.
ఇప్పటికే ప్రభాస్ 20, ఆర్ఆర్ఆర్, లవ్ స్టోరీ, అల్లుడు అదుర్స్ లాంటి సినిమా యూనిట్స్ పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూట్స చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య కూడా అదే బాటలో నడవనున్నాడని అంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు బాలయ్య సినిమా షూటింగ్ ఆపేశారట. అయితే బాలయ్య ఏమో బోయపాటిని పిలిచి మరీ షూటింగ్ ఆపవద్దని కరోనా సమస్యలు లేని దేశంలోని మిగతా రాష్ట్రాలలో కాని లేదంటే కరోనా సమస్య అంతగా కనిపించని మరో దేశంలో కాని షూటింగ్ ను కొనసాగించమని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే బోయపాటికి మాత్రం బాలయ్య చేసిన సూచన నచ్చలేదని ఇలా వేరే షూటింగ్ చేయడం తమకే కాక నిర్మాతలకి కూడా శ్రేయస్కరం కాదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుంటే బాలయ్యకి నిర్మాతల హీరోగా పేరుంది. అదీ కాక చిన్న సినిమాల వాళ్ళే షూటింగ్లు ఇక్కడ యధేచ్చగా చేసుకుంటుంటే బాలయ్యకి వేరే రాష్ట్రమో దేశమో వెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ ఏమి పట్టింది అంటూ బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా గిట్టని వారు చేస్తున్న ప్రచారం అని వారు అంటున్నారు.