English   

కరోనా ఉంది...పుట్టిన రోజు వేడుకలొద్దన్న చరణ్

Corona Virus
2020-03-18 15:42:33

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తెలంగాణలో మరో కొత్త కేసు నమోదైంది. దీంతో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చే అనుమానితులను నేరుగా ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తోంది.. అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి కట్టడికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇక సినిమా వారు కూడా ఈ కరోనా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెగా హీరో చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చరణ్‌‌తో పాటు ఎన్టీఆర్‌‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మొన్న ఈ ఇద్దరూ కలిసి ఒక వీడియో చేసి వదిలారు. 

మరో పదిరోజుల్లో తన పుట్టినరోజు నేపథ్యంలో చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం తన అభిమానలకు ఆయన ఓ లేఖ రాశాడు. ఈనెల 27న తన పుట్టిన రోజు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని ఈ సందర్భంగా ఆ లేకలో కోరాడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తన లేఖలో చరణ్ వివరించాడు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని చరణ్ లేఖలో తన అభిమానులను కోరాడు. అభిమానులుగా ఈ వైరస్ చిక్కుకున్న వారికి సేవ చేసి.. ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటించే ఆరోగ్యంగా ఉండడంమే ఈ సంవత్సరానికి మీరిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని ఆయన తన అభిమానులకు లేఖలో చెప్పుకొచ్చాడు.

More Related Stories