చివరికి బాలయ్యకు డిజాస్టర్ హీరోయిన్ దిక్కయిందా...

సీనియర్ హీరోలకు జోడీ వెతకడం దర్శకులకు తలకు మించిన భారం అవుతుంది. వాళ్ల ఇమేజ్‌కు సరిపోయే కథ రాయడానికి కూడా పెద్దగా టైమ్ పట్టడం లేదు కానీ హీరోయిన్ వెతకడానికి మాత్రం చాలా తంటాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఇదే తిప్పలు వస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలై కూడా నెల రోజులు కావొస్తుంది.. సినిమా కన్ఫర్మ్ అయి ఏడాది అయిపోయింది. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ మాత్రం కుదర్లేదు. చాలా మంది పేర్లు వినిపించినా కూడా సెట్ అవ్వలేదు. అంజలి ఇందులో ఓ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ కోసం చాలా రోజుల నుంచి వేట సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రగ్య జైస్వల్కు అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది.
ఎప్పటికప్పుడు చిట్టి పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోసి.. కెమెరా ముందు కసిగా చూస్తూ కుర్రాళ్లకు లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అసలు ఈమె ఇండస్ట్రీలో ఉన్నదే అందాల ఆరబోతను నమ్ముకుని. కథలో ఇంపార్టెన్స్ లేకపోయినా పర్లేదు కేవలం అందాల ఆరబోతతో కొందరు హీరోయిన్లు మాయ చేస్తుంటారు. దర్శక నిర్మాతలు కూడా వాళ్లను అలాగే ఎంకరేజ్ చేస్తుంటారు. ప్రగ్యా జైస్వల్ కూడా ఇదే లిస్ట్ లోకి వస్తుంది. కంచె లాంటి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పూర్తిగా తన రూట్ మార్చేసింది.
గ్లామర్ ఇండస్ట్రీ కదా.. త్వరగానే ఆ పద్దతులు ఒంట పట్టించుకుని ఒంటిపై బట్టలు తగ్గించుకుంటుంది. నక్షత్రంలో బికినీ సాంగ్ తో బీచ్ లో సాయిధరంతేజ్ తో రెచ్చిపోయిన ప్రగ్యా.. ఆ సెగలు తగ్గకముందే బోయపాటి శీను జయ జానకి నాయకాలో చిల్ బాస్ అంటూ చిట్టిపొట్టి డ్రస్సుల్లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఇక ఇప్పుడు మరోసారి ఈయనే అవకాశం ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. బాలయ్య సరసన ప్రగ్యను నటించబోతుందని తెలుస్తుంది. బాలయ్య సినిమాలో మరోసారి పూర్తిస్థాయి గ్లామరస్ పాత్రలో నటించబోతుందని ప్రగ్య. హాట్ హాట్ సాంగ్ కూడా ఒకటి చిత్రీకరించడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి శ్రీను. ఇదే ఏడాది దసరాకు బాలయ్య సినిమా విడుదల కానుంది.