English   

అనసూయ.. ఆయనతో ఏం పనులమ్మా ఇవి.. 

Anasuya
2020-03-18 17:04:45

పోటీ ఎక్కవైపోతుందేమో అనో తెలియదు కానీ ఈ మధ్య బుల్లితెర యాంకర్లు మరీ బరితెగిస్తున్నారు. ఇప్పుడు అనసూయను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆమె రోజురోజుకీ రెచ్చిపోతున్న తీరు చూసి అంతా షాక్ అయిపోతున్నారు. హీరోయిన్స్ కంటే కూడా దారుణంగా ఎక్స్ పోజింగ్ చేస్తుంది. పెళ్లైంది.. ఇద్దరు పిల్లలకు తల్లైంది అనే ధ్యాస కూడా లేదా అంటూ నెటిజన్లు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా మరోసారి ఈమె సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోయింది. జీ తెలుగులో వస్తున్న లోకల్ గ్యాంగ్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది అనసూయ. అందులో రోజురోజుకీ ఆమె గ్లామర్ షో మితిమీరిపోతుంది. దానిపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఎందుకు గ్లామర్ షో చేయడం అంటూ ఆమెను ప్రశ్నిస్తున్నారు. దీనికి అనసూయ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తోంది. ఇది గ్లామర్ షో అని దీన్ని ఇలా చేస్తేనే చూస్తారు అంటోంది ఈ భామ. 

అనసూయ చెప్పేది కరక్టే అయినా కూడా ఈ షో చూసే వాళ్లలో చిన్న పిల్లలు కూడా ఉంటారు. పైగా టీవీకి సెన్సార్ ఉండదు కదా.. అలాంటడప్పుడు మరీ ఇంతగా రెచ్చిపోతే వాళ్లకు ఏం నేర్పించినట్లు అంటున్నారు విశ్లేషకులు. ఈ వారం ప్రోమోలో 'అబ్బో నీ యమ్మ గొప్పదే' అంటూ శేఖర్ మాస్టర్‌తో కలిసి ఈమె స్టేజ్‌పై చేసిన రచ్చ మామూలుగా లేదు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా.. పట్టుకుంటే ఊడిపోయేలా ఉన్న చీరకట్టుతో మతులు చెడగొట్టింది అనసూయ. దాంతో పాటు నడుము, ఎదభాగం చూపిస్తూ రెచ్చగొట్టింది ఈమె. 

అసలు ఇలా ఎందుకు మారిపోయావ్ అనసూయ అంటూ కొందరు ఆమెను తప్పు బడుతున్నారు కూడా. సినిమాల్లో అందాలు మరి ఎక్కువైతే కట్ చెప్పడానికి సెన్సార్ బోర్డ్ ఉంది. కానీ బుల్లితెరపై అలాంటివి లేకపోవడం వల్ల అనసూయ రెచ్చిపోతుందేమో అంటూ ఆమెపై సెటైర్లు కూడా పడుతున్నాయి. మరి దీనికి ఆమె ఎలాంటి సమాధానం చెప్తుందో చూడాలిక. 

More Related Stories