English   

హ్యాపీ బర్త్ డే టు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు...

mohanbabu
2020-03-19 14:00:03

మోహన్ బాబు.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా 44 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఈయన. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చాడు భక్తవత్సలం నాయుడు. ఆ తర్వాత ఆయనే మోహన్ బాబుగా మారాడు. నాలుగు ద‌శాబ్ధాలకు పైగా ఇండ‌స్ట్రీలోనే ఉంటూ.. స్టార్ హీరోగా.. విల‌న్ గా.. న‌టుడిగా.. కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. నిర్మాత‌గా.. విద్యా వేత్త‌గా.. బిజినెస్ మ్యాన్ గా.. రాజ‌కీయ నాయ‌కుడిగా.. ఇలా ఒక్క‌టేంటి ఎన్నో విధాలుగా ప్ర‌జ‌ల ముందే ఉన్నాడు క‌లెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు.

మార్చి 19 మోహన్ బాబు జన్మదినం. ఈయన పుట్టినరోజును అభిమానులు పండగ చేసుకుంటారు. ముఖ్యంగా ఆయన విద్యాలయాల్లో ఆరోజు స్టూడెంట్స్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటూ మోహన్ బాబు గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు. దాస‌రి నారాయ‌ణ‌రావు తెర‌కెక్కించిన ఈ చిత్రంతోనే న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలి నాళ్ల‌లో హీరోతో పాటు విల‌న్ గానూ అల‌రించాడు మోహ‌న్ బాబు.

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది విల‌న్లు అయినా ఉండొచ్చు కానీ మోహ‌న్ బాబు లాంటి విల‌న్ మాత్రం మ‌ళ్లీ రాడు.. లేడు.. రాబోడు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే విల‌న్ కు కూడా ఓ స్టైల్.. మేన‌రిజ‌మ్స్ అల‌వాటు చేసిన న‌టుడు ఒక్క మోహ‌న్ బాబు మాత్ర‌మే. హీరో అయిన త‌ర్వాత ఈయ‌న విల‌నిజాన్ని చూసే భాగ్యం ప్రేక్ష‌కుల‌కు మిస్ అయిపోయింది. ఎన‌భైల్లోఏ సినిమా విడుద‌లైనా కూడా అందులో మోహ‌న్ బాబు క‌నిపించాల్సిందే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభ‌న్ బాబు, కృష్ణ‌, కృష్ణంరాజు నుంచి చిరంజీవి, బాల‌య్య‌, నాగార్జున‌, వెంక‌టేష్ వ‌ర‌కు అంద‌రితోనూ క‌లిసి న‌టించాడు మోహ‌న్ బాబు.

90ల్లో అల్లుడు గారు సినిమాతో మ‌ళ్లీ హీరో అయ్యాడు. అక్క‌డ్నుంచి సూప‌ర్ స్టార్ గా వెలిగిపోయాడు మోహ‌న్ బాబు. బ్ర‌హ్మ‌, పెద‌రాయుడు, అల్ల‌రి మొగుడు, అడ‌విలో అన్న లాంటి ఎన్నో సంచ‌ల‌న సినిమాల‌తో స‌త్తా చూపించారు. ఇక మిలీనియం మొదట్లో సురేష్ కృష్ణ తెరకెక్కించిన రాయలసీమ రామన్న చౌదరి చిత్రం మోహన్ బాబు కెరీర్లో  ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇది ఆయనకు 500వ సినిమా కావడం విశేషం. అప్పట్లో ఇండ‌స్ట్రీ హిట్లు కూడా అందుకున్నారు మోహన్ బాబు. ఈ మ‌ధ్యే గాయ‌త్రిలోనూ హీరో విల‌న్ గా ర‌ప్ఫాడించాడు క‌లెక్ష‌న్ కింగ్. ఒక‌ప్పుడు మోహ‌న్ బాబు సినిమా వ‌స్తుందంటే చాలా అంచ‌నాలుండేవి. కానీ కాలం మారిపోవ‌డంతో ఆయ‌న కూడా సినిమాలు త‌గ్గిస్తూ వ‌చ్చారు.

గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో అల్ల‌రి న‌రేష్ తో ఓ సినిమా చేసిన మోహ‌న్ బాబు.. మొన్న గాయ‌త్రి అంటూ వ‌చ్చారు. ఇన్నేళ్ల కెరీర్ లో మోహ‌న్ బాబు చేసిన‌న్ని పాత్ర‌లు మ‌రే హీరో చేయ‌లేదు.. ఎన్టీఆర్ త‌ర్వాత ఆ స్థాయిలో తెలుగు డైలాగులు చెప్ప‌డంలో క‌లెక్ష‌న్ కింగ్ రూటే స‌ప‌రేటు. ఇప్పటికీ అప్పుడప్పుడు మంచి పాత్రలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తూనే ఉన్నారు మోహన్ బాబు.  తన ఊపిరి ఉన్నంతవరకూ నటిస్తూనే ఉంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు కలెక్షన్ కింగ్. ఇప్పుడు కూడా సూర్య హీరోగా వస్తున్న ఆకాశమే హద్దుగా సినిమాలో మేజర్ పాత్రలో నటిస్తున్నాడు మోహన్ బాబు. 38 ఏళ్ళ తర్వాత ఆయన నటిస్తున్న తమిళ సినిమా ఇది. ఇన్నేళ్ల ప్ర‌యాణం ఇంకా ఎన్నోఏళ్లు సాగాలని ఆశిస్తూ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More Related Stories