English   

విజయ్ క్రేజ్ ఏంటో...అసలు తగ్గడం లేదుగా

vijay
2020-03-19 07:23:39

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఎవరు తోపు అంటే ఎన్టీఆర్ అనేవారు, ఆ తరువాతి తరంలో చిరంజీవి చేరారు, ఇప్పుడు ఒక రకంగా మహేష్ బాబు హవా నడుస్తుందనుకోండి. అయితే అలాంటి మహేష్ ను సైతం వెనక్కు నెట్టాడు విజయ్ దేవరకొండ. విషయం ఏమిటంటే  టైమ్స్ గ్రూప్ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘ది టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్’ సర్వేలో భాగంగా 2019 సంవత్సరానికి సంబంధించి జాబితాను ఈరోజు విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ ఫస్ట్ స్థానంలో నిలిచారు. గత ఏడాది కూడా విజయ్ దేవరకొండ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హిట్ ఫ్లాపులతో పని లేకుండా క్రేజ్ మెయింటేన్ చేసే హీరోలు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. ఎందుకంటే మనోడి గత రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

అయినా కూడా ఇమేజ్ పరంగా మనోడు టాప్‌ లోనే ఉన్నాడు.  ఇక ఈ లిస్టులో విజయ్ తర్వాత తెలుగు నుండి చరణ్ ఉన్నాడు. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న చెర్రీ ఈ ఏడాది 2వ స్థానంలోకి వచ్చాడు. ఇక మరో స్టార్ హీరో ప్రభాస్ గత సంవత్సరం రెండవ స్థానంలో ఉండగా ఈ సారి ఆ రెండు నుండి 4వ స్థానానికి పడిపోయాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ జోష్ లో ఉన్న రామ్ పోతినేని ఏకంగా 8 స్థానాలు పైకొచ్చి 3వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ విషయాన్ని షేర్ చేసుకున్న విజయ్ దాంతో పాటు కింద మరో నోట్ ఇచ్చాడు విజయ్. ఇది కేవలం టీజర్ మాత్రమేనన్న విజయ్ ఈ ఏడాది ఇంకా చాలా సర్‌ప్రైజులు మీ కోసం ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 

More Related Stories