English   

రామ్ తో రాజమౌళి సినిమా

ram
2020-03-19 07:46:19

రామ్‌ తో ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమానా ? కామెడీ కానీ చెయ్యట్లేదు కదా, అనుకుంటున్నారా ? అవును నిజమే. రామ్ తో జక్కన్న ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి గతంలో రామ్‌ చరణ్ కథానాయకుడుగా ‘మగధీర’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందించి తెలుగు సినిమా సత్తా చాటాడు. దాంతో తదుపరి సినిమా సైతం అదే స్థాయిలో తెరకెక్కిస్తాడనుకున్నా సునీల్‌తో ‘మర్యాద రామన్న’ అనే సింపుల్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు జక్కన్న.

ఆయన ఇప్పుడు మళ్ళీ లేక్కలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం జక్కన్న రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ కథానాయకులుగా వస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతుంది. దీని తర్వాత రామ్‌ కోసం ఓ కథ సిద్ధం చేశాడని వినిపిస్తోంది. రామ్ ఇప్పుడు రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత జక్కన్నతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జక్కన్నతో సినిమా అంటే ఎవరు కాదంటారు. చూడాలి ఇది ఎంత వరకు నిజమో మరి.  

 

More Related Stories