English   

నాగబాబు గురించి ఆది షాకింగ్ కామెంట్స్..ఆ నిజాలు తెలిశాయి 

 Hyper Aadi
2020-03-19 10:35:41

మెగా ఫ్యామిలీలో అందరికీ భజన చేయడంలో ముందుంటాడు హైపర్ ఆది. అయితే ఈమధ్య కాలంల్లో నాగబాబుకి హైపర్ ఆది దూరమయ్యాడనే చెబుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే రెమ్యునరేషన్ విషయాల్లో విభేదించి జబర్థస్త్ నుంచి బయటకెళ్ళిన నాగబాబు 'అదిరింది' అనే షో చేస్తున్నాడు. ఈ షోని జీ తెలుగు వాళ్ళు టెలీకాస్ట్ చేస్తున్నారు. అయితే ముందు నాగాబాబుతో పాటు అదిరిందికి హైపర్ ఆది కూడా వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడ ఏమయిందో ఏమో కానీ నుంచి ఆది అక్కడి నుండి బయటికొచ్చారు. 

ఈ నేపథ్యంలో నాగబాబుకి ఆది దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై ఆది క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యన ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు గురించి ప్రస్తావించాడు. తాము ఇద్దరం దూరం కాలేదని చెప్పుకొచ్చాడు. నాగబాబు చేస్తున్న షోలో కొంతమంది వ్యక్తుల గురించి తనకు కొన్ని నిజాలు తెలిసాయని అందుకే ఆయనతో నిలబడలేకపోయానని చెప్పుకొచ్చాడు. 

అక్కడున్న మిగతా వాళ్లంతా కూడా తనకు బాగా కావలసిన వాళ్లేనన్న ఆది కొందరి వలన బయటకి వచ్చానని క్లారిటీ ఇచ్చాడు. నాగబాబు మా అందరికి బాగా కావాల్సిన వ్యక్తన్న ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే ఆయన కోరుకుంటారని చెప్పుకొచ్చాడు. అలాగే తాను ఆ షోకి ఆ షోకి సంబందించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే దూరం అయ్యాననీ, నాగబాబుకు కాదని చెప్పుకొచ్చాడు ఆది. 

More Related Stories