English   

ప్రభాస్ నా కొడుకు అంటున్న అనుష్క శెట్టి.. 

 Prabhas
2020-03-19 11:01:27

వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు అనుష్క ఇదే చెప్పింది మరి. ఈ రోజుల్లో సెలెబ్రెటీస్ పెళ్లి అంటే 30 త‌ర్వాతే. హీరోయిన్లు కూడా 30 దాటిన త‌ర్వాత కానీ పెళ్లి చేసుకోవ‌డం లేదు. ఈ లిస్ట్ లో మూడు ప‌దులు దాటేసి అనుష్క 8 ఏళ్లైపోయింది. ఇక ప్ర‌భాస్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఇద్ద‌రూ 30 దాటి చాలా ఏళ్లైపోయింది. దాంతో సాధారణంగానే ఇద్ద‌రి పెళ్ళిపై ఎప్పుడూ కావాల్సిన‌న్ని రూమ‌ర్లు వ‌స్తూనే ఉంటాయి. ప్ర‌భాస్ వ‌య‌సు 39 ఏళ్లు.. అనుష్క వ‌య‌సు 38 ఏళ్లు.. ఇద్ద‌రూ పెళ్లికి దూరంగానే ఉన్నారు. మ‌గాళ్ళ ముచ్చ‌టేమో గానీ.. అమ్మాయి వ‌యసు 30 దాటితే ఇంకా పెళ్లి కాలేదా అంటారు. కానీ అనుష్క మాత్రం 38 వ‌చ్చినా.. అప్పుడే నాకు పెళ్ళేంటి అంటుంది. ప్ర‌భాస్ అయితే పెళ్ల‌నే ఒక మాట ఉంద‌నే విష‌య‌మే మ‌రిచిపోయాడు. 

ఇదిలా ఉంటే ఈ ఇద్దరిపై ఎప్పుడూ గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికే అనుష్క గురించి చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. తాజాగా అనుష్క కూడా ప్రభాస్ గురించి చెప్పింది. ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిశ్శబ్ధం సినిమా ప్రమోషన్స్‌ కోసం ఈటీవీ క్యాష్ ప్రోగ్రామ్‌కు వచ్చింది అనుష్క. అందులో సుమ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. ప్రభాస్ ఫోటో చూపించగానే మరో మాట లేకుండా తన కొడుకు అని చెప్పి షాక్ ఇచ్చింది జేజమ్మ. అదేంటి అంటే అది అంతే.. నా కొడుకే కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది. 

ఆయనలో నాకు నచ్చే గుణం.. మనుషులకు చాలా బాగా గౌరవమిస్తాడు అంటూ ప్రభాస్ గురించి చెప్పింది అనుష్క. మీ ఇద్దరికి చాలా పోలికలున్నాయి కదా అని సుమ అడిగిన వెంటనే.. ఎంతైనా నా కొడుకు కదా.. అందుకే నా పోలికలే వస్తాయ్ అంటూ మరో పంచ్ వేసింది అనుష్క. మరి అమరేంద్ర బాహుబలి గురించి చెప్పండి అంటే ఆయన ఉన్నాడు కాబట్టే కదా ఈయన కొడుకు అయ్యాడు అంటూ మరో సెటైర్ వేసింది. అనుష్క చెప్పిన ఈ డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

More Related Stories