English   

పవన్ మళ్లీ రాజకీయాలు.. టెన్షన్‌లో నిర్మాతలు.. 

Pawan Kalyan
2020-03-19 14:34:37

పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిట్ అయినపుడే ఆయనతో కష్టనష్టాలు కూడా కమిటవ్వాలి. ఇప్పుడు నిర్మాతలు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. ఆయన డేట్స్ ఇచ్చినంత మాత్రాన సినిమా అయిపోతుంది అనుకుంటే అంతే ఇంక. ఇప్పుడు నిర్మాత దిల్ రాజును చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆయనతో పాటు మరో ఇద్దరు నిర్మాతలకు కూడా ఇదే పరిస్థితి. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అయినా చేయాలి అని ఇండస్ట్రీలో ప్రతి నిర్మాత కోరుకుంటాడు. దిల్ రాజు కూడా ఈ అవకాశం కోసం 20 ఏళ్లుగా వేచి చూస్తున్నాడు. ఇన్నాళ్లకు అది వచ్చింది కానీ తిప్పలు కూడా వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే ఆ మాత్రం కష్టపడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా కమిట్ అయితే సరిపోదు ఆయనతో సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టాలు భరించక తప్పదు. ఆయన డేట్స్ సంపాదించడం అంటే ఇప్పుడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే. 

రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ అది వదిలేసి ఇక్కడ సినిమా అనుకున్న సమయంలో పూర్తి చేస్తాడు అంటే అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు. వకీల్ సాబ్ పరిస్థితి కూడా అలాగే మారింది ఇప్పుడు. అసలే కరోనా ఎఫెక్ట్ ఉన్న నిర్మాతలకు ఇప్పుడు పవన్ పాలిటిక్స్ ఎపిసోడ్ కూడా చిరాకు పుట్టిస్తుంది. ఈ సినిమా కోసం కేవలం 25 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. 25 రోజులు ఇస్తే చాలు మేము సినిమా పూర్తి చేసుకుంటారు అని పవన్ కళ్యాణ్ ను అడిగినట్లు తెలుస్తుంది. అయితే ఇచ్చిన డేట్స్ లో కూడా ఇప్పుడు మళ్లీ రాజకీయాలు అంటున్నాడు పవర్ స్టార్. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ నాయకుడైనా జనాల ముందుకు వెళ్లడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఓడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా జనాల్లో కనిపిస్తున్నాడు. తనకు గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదని ప్రజలకు మంచి చేయడం సేవ చేయడం మాత్రమే తెలుసు అంటున్నాడు జనసేనాని. 

అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సినిమాలు చేయించడం అంటే చిన్న విషయం కాదు. దాని కోసం దర్శక నిర్మాతల తలప్రాణం తోకలోకి వస్తుంది. ఈ సినిమాను మేలో అనుకున్నా కూడా ఇప్పుడు జూన్ కు పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఏఎం రత్నం దీనికి నిర్మాత. ఇందులో బందిపోటుగా నటిస్తున్నాడు పవర్ స్టార్. వీటితో పాటు హరీష్ శంకర్ కూడా లైన్ లోనే ఉన్నాడు. ఏదేమైనా కూడా ఒక వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మళ్లీ సినిమాలు వదిలేసి రాజకీయాలు అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎలాగూ కరోనా కారణంగా షూటింగ్స్ నిలిపేయడంతో ఆ సమయం రాజకీయాలకు కేటాయిస్తున్నాడు పవన్. జనసేన ఆవిర్భావ దినోత్సవం నుంచి రాజకీయాల్లో చురుకైపోయాడు జనసేనాని. 

More Related Stories